Winter Chapped Lips: చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
Winter Chapped Lips: Winter Chapped Lips: చలికాలం ప్రారంభమైతే చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం చాలా మందిని వేధించే సమస్యలు.
Winter Chapped Lips: చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోతున్నాయా? దీని వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
Winter Chapped Lips: చలికాలం ప్రారంభమైతే చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం చాలా మందిని వేధించే సమస్యలు. వాతావరణ మార్పు కారణమే అని చాలామంది భావిస్తారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం, ఈ సమస్యకు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది — అది శరీరంలో ఉండే విటమిన్ బీ12 లోపం.
పెడవులు పగిలిపోవడానికి అసలు కారణం ఏమిటి?
చలికాలంలో పెదవులు తరచూ పగిలిపోవడానికి ప్రధాన కారణం విటమిన్ బీ12 లోపమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ తక్కువగా ఉంటే పెదవులు పొడిబారడమే కాకుండా చర్మం రఫ్‌గా మారుతుంది.
విటమిన్ బీ12 శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాక,
♦ జ్ఞాపకశక్తి తగ్గడం
♦ చేతులు, కాళ్లలో చిమ్మట
♦ అలసట
♦ జలదరింపు
వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా, ఈ విటమిన్ శరీరంలో DNA సంశ్లేషణకు కూడా అవసరం.
విటమిన్ బీ12 లోపం నివారించేందుకు ఏమి తినాలి?
విటమిన్ బీ12 ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు ఇవి:
చేపలు:
సాల్మన్, ట్యూనా, సార్డిన్ — వీటిలో విటమిన్ బీ12 బాగా లభిస్తుంది.
షెల్ఫిష్:
క్లామ్స్, ఆయిస్టర్స్ కూడా మంచి మూలాలు.
గుడ్లు:
రోజూ గుడ్లు తీసుకుంటే విటమిన్ బీ12 లోపం తగ్గుతుంది.
పాల ఉత్పత్తులు:
పాలు, పెరుగు, పనీర్ వంటి పాలు ఆధారిత పదార్థాలు శరీరానికి అవసరమైన విటమిన్ బీ12 అందిస్తాయి.
రోజువారీ ఆహారంలో ఈ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ బీ12 స్థాయిని పెంచుకోవచ్చు. దీంతో చలికాలంలో పెదవులు పగిలిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.