చలికాలం ఆల్కహాల్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుందా..! ఇందులో నిజమెంత..?

Alcohol in Winter: చలికాలంలో చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఇది చలి నుంచి వారిని వెచ్చగా ఉంచుతుందని భావిస్తారు.

Update: 2022-01-04 08:30 GMT

చలికాలం ఆల్కహాల్ తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుందా..! ఇందులో నిజమెంత..?

Alcohol in Winter: చలికాలంలో చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఇది చలి నుంచి వారిని వెచ్చగా ఉంచుతుందని భావిస్తారు. ఇందులో నిజమెంత..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చలిలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం వేడిగా అనిపించవచ్చు కానీ అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందనేది మాత్రం వాస్తవం. ఇది పరోక్షంగా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది.

హైపోథర్మియా అనేది వేడిని ఉత్పత్తి చేయడానికి ముందు శరీరం అంతర్గత వేడిని కోల్పోయినప్పుడు ఏర్పడే పరిస్థితి. ఈ స్థితిలో వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లో బీపీ వంటి సమస్య ఏర్పడుతుంది. అందుకే కొంతమంది చలిలో కానీ వర్షాకాలంలో కానీ ఎంత తాగుతారో అంతగా వణుకుతుంటారు. హైపోథర్మియా వల్ల శరీర ఉష్ణోగ్రత కోల్పోయి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్కహాల్‌ తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం కోసం దీర్ఘకాలికంగా ఉండే ఉష్ణోగ్రతను కోల్పోతారు.

ఇది రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. గతేడాది వాతావరణ శాఖ చలికాలంలో మద్యం సేవించరాదని సూచించింది. తరువాత BBC నివేదిక కూడా ఇదే తేల్చింది. వైద్యులు కూడా ఆల్కహాల్‌ తాగడాన్ని నిషేధించారు. సాధారణ శరీర ఉష్ణోగ్రత 36-37 డిగ్రీల సెల్సియస్ మద్యం తాగిన తర్వాత అది 35 డిగ్రీలకు పడిపోతుంది. శరీరం చల్లబడటం ప్రారంభమవుతుంది.

విపరీతమైన చలిలో ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఉష్ణోగ్రత కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాస్తవానికి ఆల్కహాల్ ఒక డ్రగ్ లాగా పనిచేస్తుంది. దీని వల్ల రక్త నాళాలు సాగుతాయి. సిరల్లో రక్తప్రసరణ ఎక్కువగా జరిగితే చర్మంపైకి ఎక్కువ రక్తం చేరుతుంది. ఆ పరిస్థితిలో మీరు కొంత సమయం పాటు వేడిగా ఉంటారు, చెమట కూడా పట్టవచ్చు. ఈ పరిస్థితిలో మీరు చలి, వేడి అనుభూతి గురించి గందరగోళానికి గురవుతారు. అల్ప ఉష్ణోగ్రత స్థితికి మారిపోతారు.


Tags:    

Similar News