Benefits Of Pear: ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకంటే..?
Benefits Of Pear: పియర్స్ పండ్లు ఒకప్పుడు చాలా తక్కువ మందికి వీటి గురించి తెలిసేవి. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లో కూడా సూపర్ మార్కెట్లు అందుబాటులోకి రావడం.
Benefits Of Pear: ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకంటే..?
Benefits Of Pear: పియర్స్ పండ్లు ఒకప్పుడు చాలా తక్కువ మందికి వీటి గురించి తెలిసేవి. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లో కూడా సూపర్ మార్కెట్లు అందుబాటులోకి రావడం. ఆన్‌లైన్‌లోనూ పండ్లు లభించడంతో ఎక్కువ మందికి వీటి గురించి అవగాహన లభిస్తోంది. అయితే ధర ఎక్కువనో, వీటి గురించి తెలియకో చాలా మంది పియర్ పండ్లను తినడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. అయితే ఈ పండ్లతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పియర్ పండు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సార్బిటాల్ అనే సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణం మలాన్ని సులభంగా కదిలించడంలో సహాయపడుతూ, మలబద్ధక సమస్యను నివారించడానికి ఉపయోగపడుతుంది.
* పియర్స్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. కంటి చూపును మెరుగుపరిచే ఈ పోషకాలు, వయస్సు పెరిగే కొద్దీ శుక్లాలు ఏర్పడకుండా అడ్డుకోవడంలో ఉపయోగపడుతుంది.
* పియర్స్ పండ్లలో రెండు రకాల ఫైబర్‌లు ఉంటాయి – సాల్యూబుల్, ఇన్‌సాల్యూబుల్. ఇవి రక్తంలోని షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరిచే ఈ పండ్లు ఉపయోగపడతాయి
* బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పియర్స్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది దీంతో త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తక్కువ క్యాలరీలు ఉండడంతో బరువు తగ్గుతారు. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల నుంచి రక్షిస్తాయి.
* పియర్స్ పండ్లలో విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, సహజమైన కాంతిని అందిస్తుంది. పియర్స్ పండ్లు తరచుగా తింటే చర్మం నిగారింపు పొందుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న వాటి ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.