Urinary Tract Infection : మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి?

యూరిన్ ఇన్ఫెక్షన్.. దీనిని మెడికల్ భాషలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. ఇది చాలామంది మహిళలను వేధించే సమస్య. మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి పెరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.

Update: 2025-08-03 08:00 GMT

Urinary Tract Infection : మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి?

Urinary Tract Infection : యూరిన్ ఇన్ఫెక్షన్.. దీనిని మెడికల్ భాషలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. ఇది చాలామంది మహిళలను వేధించే సమస్య. మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించి పెరగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చిన్నదిగా ఉన్నప్పుడు సులభంగా నయమవుతుంది.. కానీ సమయానికి చికిత్స చేయకపోతే కిడ్నీల వరకు పాకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టించవచ్చు. దీని వల్ల పదేపదే మూత్రానికి వెళ్లడం, మంట, కడుపులో నొప్పి, నీరసం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా కాలం యూటీఐ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారణం వారి మూత్రనాళం పొడవు తక్కువగా ఉండటం. దీని వల్ల బ్యాక్టీరియా సులభంగా మూత్రనాళంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా, దీనికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతను పాటించకపోవడం, అపరిశుభ్రమైన టాయిలెట్స్‌ను ఉపయోగించడం, ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవడం, రోజు తగినంత నీరు తాగకపోవడం, ఇంటర్‌కోర్స్ సమయంలో కూడా బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరవచ్చు.

గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో యూటీఐ వచ్చే ప్రమాదం ఇంకా ఎక్కువ. కొంతమంది మహిళలకు పదే పదే ఈ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీనిని రికరెంట్ యూటీఐ అని అంటారు. ఇది వారి రోజువారీ జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది.

యూటీఐ లక్షణాలు దాని తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా నొప్పి అనిపిస్తుంది. తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, కానీ చాలా తక్కువ మూత్రం రావడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవ్వలేదనే భావన కలుగుతుంది. మూత్రం రంగు చిక్కగా మారడం లేదా దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా కనిపించవచ్చు. కడుపు కింది భాగంలో లేదా వీపులో నొప్పి, అలసట, జ్వరం, వణుకు వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ పాకితే మరింత తీవ్రంగా మారవచ్చు, అప్పుడు తీవ్రమైన జ్వరం, వాంతులు, వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి వస్తాయి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మూత్రాశయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. మూత్రం వచ్చినప్పుడు వెంటనే వెళ్లడం మంచిది. టాయిలెట్ వాడిన తర్వాత ప్రైవేట్ భాగాలను ముందు నుండి వెనుకకు శుభ్రం చేయండి. ఇంటర్‌కోర్స్ తర్వాత మూత్రం పోయడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. ప్రైవేట్ భాగాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సింథటిక్ లేదా బిగుతైన లోదుస్తులకు బదులుగా, కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

Tags:    

Similar News