Girls: పరీక్షల్లో అమ్మాయిలే ఫస్ట్ ఎందుకు వస్తారు.. ?

Girls: విద్యార్థుల జీవితంలో పరీక్షలు ముఖ్యమైనవి. పరీక్షలంటే పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా భయపడతారు. పరీక్షలు ఎలా రాస్తారో లేదో అని టెన్షన్ పడతారు. కొంతమంది ఆకలి, నిద్రలు మానేసి చదువుతునే ఉంటారు.

Update: 2025-05-29 14:00 GMT

Girls: పరీక్షల్లో అమ్మాయిలే ఫస్ట్ ఎందుకు వస్తారు.. ?

Girls: విద్యార్థుల జీవితంలో పరీక్షలు ముఖ్యమైనవి. పరీక్షలంటే పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువగా భయపడతారు. పరీక్షలు ఎలా రాస్తారో లేదో అని టెన్షన్ పడతారు. కొంతమంది ఆకలి, నిద్రలు మానేసి చదువుతునే ఉంటారు. పరీక్షలు రాసిన తర్వాత మళ్లీ రిజల్ట్స్ టైంలో ఎక్కువగా ఆందోళన చెందుతారు.


మీరు గమనించినట్లయితే పరీక్షల్లో ఎప్పుడూ కూడా అమ్మాయిలే ఫస్ట్ వస్తారు. అయితే, అమ్మాయిలు ఎప్పుడూ ముందు ఎందుకు ఉంటారో తెలుసా? అమ్మాయిలు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి, ఫలితాల్లో అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అమ్మాయిలు అబ్బాయిల కంటే బాగా చదువుతారు. వారు తమ ఎక్కువ సమయాన్ని చదువుకే కేటాయిస్తారు. ముఖ్యంగా పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్దీ వారి పూర్తి దృష్టి చదువుపైనే ఉంటుంది. అమ్మాయిలు తక్కువ మార్కులు వస్తే లేదా ఫెయిల్ అయితే ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని ఆందోళన చెందుతారు. వాళ్ళు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటారు కాబట్టి, ఎంత కష్టం వచ్చినా కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకుని పరీక్షల్లో రాణిస్తారు.


మరోవైపు, తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా భావిస్తారు. స్కోరు తక్కువగా ఉంటే తల్లిదండ్రులు కూడా అందరూ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల చదువులో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారు.

Tags:    

Similar News