Varicose Veins: ఎందుకు ఈ మధ్యకాలంలో వెరికోవెయిన్స్ సమస్య ఎక్కువైంది.. మన జీవనశైలే కారణమా?
Varicose Veins: ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధపడుతోన్న ఆరోగ్య సమస్య..వెరికో వెయిన్స్. అలసు వెరికో వెయిన్స్ ఎందుకు వస్తాయి?
Varicose Veins: ఎందుకు ఈ మధ్యకాలంలో వెరికోవెయిన్స్ సమస్య ఎక్కువైంది.. మన జీవనశైలే కారణమా?
Varicose Veins: ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధపడుతోన్న ఆరోగ్య సమస్య..వెరికో వెయిన్స్. అలసు వెరికో వెయిన్స్ ఎందుకు వస్తాయి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి. మరి దీని నుండి ఎలా బయటపడాలి? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కాళ్ల కండరాలు ఉబ్బిపోవడం, నరాలు బయటకు వచ్చినట్టు ఉండటం, కొన్ని చోట్ల నరాలు మెలికలు తిరిగి ఉండటం... ఇవన్నీ వెరికో వెయిన్ ఉందని చెప్పే గుర్తులు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ కూడా ఈ వెరికో వెయిన్స్‌తో బాధపడుతున్నారు. అయితే దీనికి మొదట్లో నొప్పి ఉండదు. ఆ తర్వాత విపరీతమైన నొప్పి కలుగుతుంది. అందుకే ముందుగానే జాగ్రత్తపడి చికిత్స చేయించుకుంటే మంచిదని డాక్టర్లు అంటున్నారు.
లక్షణాలు ఇవే..
వెరికో వెయిన్స్ అంటే సిరలు ఉబ్బడం. అది కాళ్లపై కావచ్చు. చేతులపై కావచ్చు. సిరలు ఉబ్బనట్టుగా పైకి తేలి ఉంటాయి. అంటే చూడంగానే కాళ్లపై నరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే కొంతమందిలో నరాలు మెలితిరుగుతాయి. పెద్దవిగా మారతాయి. ఇవి కాళ్లపై కనిపించాయంటే అవి వెరికో వెయిన్స్ అని గుర్తించాలి. అయితే మొదటి దశలో ఉన్నప్పుడు నొప్పి ఉండదు. కాబట్టి అప్పుడే దీనికి చికిత్స తీసుకోవాలి. రెండో దశలో నొప్పి ప్రారంభం అవుతుంది. దురద వస్తుంది. అదేవిధంగా కాళ్లలో వాపు కనిపిస్తుంది.
ఎందుకు వస్తాయి?
వెరికో వెయిన్స్ అనేవి సిరల లోపల వాల్వ్‌లకు సంబంధించిన సమస్య. వంశపారంపర్యంగా ఇవి రావొచ్చు. అదేవిధంగా అధిక బరువు, గర్బం, ఎక్కువ సేపు నిలబడి ఉండటం లేదా కూర్చుని ఉండటం వల్ల వెరికో వెయిన్స్ వస్తాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వెరికో వెయిన్స్ కాళ్లలో లైట్‌గా కనబడినప్పటి నుంచే వ్యాయామం మొదలుపెట్టాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అరగంట పాటు నడవాలి. దీంతో పాటు కంప్రెషన్ మేజోళ్లు ధరించాలి. ఒకవేళ వెరికో వెయిన్స్ అప్పటికి తగ్గకపోయినా, నొప్పి పెరుగుతున్నా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
ఇవి చేయొద్దు
వెరికోవెయిన్స్ ఉన్నవాళ్లు ఎక్కువ సేపు నిలబడడం గానీ, కూర్చోవడం గానీ చేయకూడదు. అంతేకాదు శరీర బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచాలి. డాక్టర్ సలహా మేరకు తగిన వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల వెరికో వెయిన్స్ పెరగకుండా ఉంటాయి.