Health: వీళ్లు గోరు వెచ్చ‌ని నీరు అస్స‌లు తాగ‌కూడ‌దు.. ఏమ‌వుతుందో తెలుసా?

Health: గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Update: 2025-04-20 15:30 GMT

Health: వీళ్లు గోరు వెచ్చ‌ని నీరు అస్స‌లు తాగ‌కూడ‌దు.. ఏమ‌వుతుందో తెలుసా?

Health: గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతుంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాక, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో దోహదపడుతుంది. అయితే ఇది అంద‌రికీ వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేమ‌ని నిపుణులు చెబుతున్నారు. కొన్ని స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు ఎట్టి ప‌రిస్థితుల్లో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోకూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు:

గోరువెచ్చని నీరు రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. గుండె సమస్యలున్నవారికి ఇది ప్రమాదకరం కావొచ్చు, ఎందుకంటే రక్తపోటు అసమతులతకు గురై తలతిరుగడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

తక్కువ బీపీ ఉన్నవారు:

తక్కువ రక్తపోటుతో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఇది రక్తనాళాల్ని విపరీతంగా విస్తరించడంతో రక్తపోటు మరింత తగ్గిపోతుంది, ఇది ప్రమాదకరమవుతుంది.

డీహైడ్రేష‌న్ లేదా బలహీనతతో ఉన్నవారు:

వేడి నీరు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనివల్ల చెమట ఎక్కువగా వచ్చి దాహం పెరిగి డీహైడ్రేష‌న్ పెరిగే అవ‌కకాశం ఉంటుంది.

జ్వరం లేదా ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు:

అధిక జ్వరంలో శరీరం ఇప్పటికే వేడి ఉంటుంది. అలాంటప్పుడు గోరువెచ్చని నీరు తాగడం శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతుంది. అందుకే వైద్యులు ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటినే తాగమంటారు.

గర్భిణీ స్త్రీలు:

గర్భధారణ ప్రారంభ దశలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర వేడి పెరగవచ్చు. ఇది మాతృశిశువు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే గ‌ర్భిణీలు వేడి నీటిని తీసుకోకూడ‌దు.

అధిక ఉష్ణోగ్రతల వాతావరణంలో ఉన్నవారు:

వేసవి కాలంలో శరీరం సర్వసాధారణంగా వేడిగా ఉంటుంది. అలాంటి సమయంలో గోరువెచ్చని నీరు తాగడం శరీరాన్ని ఇంకా వేడిగా చేసి హీట్ స్ట్రోక్, తలనొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

Tags:    

Similar News