Walk 10,000 Steps : రోజుకు 10,000 అడుగులు నడిచే వారికి ఈ విషయం తెలియాల్సిందే
ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా చలికాలంలో అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలంటే మంచి అలవాట్లు అవసరం.
Walk 10,000 Steps : రోజుకు 10,000 అడుగులు నడిచే వారికి ఈ విషయం తెలియాల్సిందే
Walk 10,000 Steps : ప్రస్తుత బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా చలికాలంలో అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలంటే మంచి అలవాట్లు అవసరం. వాటిలో వాకింగ్ అనేది చాలా సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నడిచే వ్యక్తి అనారోగ్యం నుంచి దూరంగా ఉంటాడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు,శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలనుకునేవారు రోజుకు 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటే, అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మరి ఈ 10,000 అడుగుల వాకింగ్ వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యానికి ఢోకా లేదు
రోజుకు 10,000 అడుగులు నడవడం అనేది ఒక అద్భుతమైన ఏరోబిక్ యాక్టివిటీ. మీరు చురుకుగా నడిచినప్పుడు మీ గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండె మరింత బలంగా తయారవుతుంది. ప్రతిరోజూ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాకింగ్ అనేది గుండె ఆరోగ్యానికి సహజమైన టానిక్ లా పనిచేస్తుంది.
మెరుగైన జీవక్రియ
ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం అనేది శరీర జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. జీవక్రియ మెరుగైతేనే, మనం తిన్న ఆహారం శక్తిగా మారుతుంది. ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, శరీరంలోని అంతర్గత వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్పేది ఏంటంటే, ఈ అలవాటు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతమైన మార్గం.
రక్తంలో చక్కెర నియంత్రణ
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరింత ప్రభావవంతంగా నియంత్రించవచ్చని అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. క్రమంగా, ఇది టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్నవారు కూడా తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వాకింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకోవడం ఉత్తమం.
బరువు తగ్గడానికి బెస్ట్
మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే, ఈ 10,000 అడుగుల నడక మీకు చక్కటి పరిష్కారం. ప్రతిరోజూ ఇంత దూరం నడవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇది సమర్థవంతంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. వాకింగ్‌ను ఆహార నియంత్రణతో కలిపితే, ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. ఫిట్‌నెస్ నిపుణులు కూడా బరువు తగ్గే ప్రయాణంలో ఈ అలవాటును చేర్చుకోవాలని గట్టిగా సిఫార్సు చేస్తారు.
కండరాలు దృఢంగా
ప్రతిరోజూ చురుకుగా నడవడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. ముఖ్యంగా కాళ్లు, నడుము కండరాలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఇది ఎముకలు, కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే ఇది ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల క్షీణతను నివారించడానికి వాకింగ్ ఒక అద్భుతమైన మార్గం.