Vitamin D: మన శరీరంలో విటమిన్ D తగ్గితే క్యాన్సర్ ప్రమాదం వస్తుందా?
Vitamin D Deficiency: మన శరీరానికి అన్ని విటమిన్స్ అవసరం. ఖనిజాలు కూడా ఎంతో ముఖ్యం. అయితే ఏ విటమిన్ తగ్గినా ఆరోగ్య సమస్యలు తప్పవు.
Vitamin D: మన శరీరంలో విటమిన్ D తగ్గితే క్యాన్సర్ ప్రమాదం వస్తుందా?
Vitamin D Deficiency: విటమిన్ డీ అనేది సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎముకలతో పాటు కండరాల అభివృద్ధికి ఎంతో అవసరం. వాటిని బలంగా మారుస్తుంది. సెల్ అభివృద్ధిని కూడా నియంత్రిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. అందుకే మన శరీరంలో విటమిన్ డీ తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే చాలామందిలో మెదులుతున్న ప్రశ్న విటమిన్ డీ తగ్గితే క్యాన్సర్ వస్తుందా?
విటమిన్ డీ మన శరీరంలో తగ్గితే క్యాల్షియం గ్రహించడం కూడా మన శరీరానికి కష్టతరం అవుతుంది. దీంతో ఎముకలు, కండరాలు బలహీనంగా మారిపోతాయి. విటమిన్ డీ మన శరీరంలో తప్పితే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదికల ప్రకారం 70% మందిలో విటమిన్ డీ లేమితో బాధపడుతున్నారు. అంటే ప్రతి నలుగురులో ముగ్గురికి విటమిన్ డీ లేనట్లే. దీంతో వాళ్లకి క్యాన్సర్ ప్రమాదం మరింతగా ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డీ మన శరీరంలో తగ్గుతే ఇది కేవలం ఎముకలపై మాత్రమే కాదు. శరీరం మొత్తం పై ప్రభావం పడుతుంది. ఇది కణాల అభివృద్ధికి నియంత్రిస్తుంది. ఎముకలు, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదు మంట, వాపు సమస్యను తగ్గిస్తుంది. విటమిన్ డీ తగ్గితే మన శరీరంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఇది ప్రాణాంతక క్యాన్సర్లకు కారణం అవుతుంది.
విటమిన్ డీ మన శరీరంలో తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాలామంది ఎండలో సరిగా ఉండరు. కేవలం తక్కువ సమయం మాత్రమే కేటాయిస్తారు. ఈ బిజీ లైఫ్ లో ఎండ నుంచి దూరంగా ఉంటారు. హడావిడిగా ఆఫీసు లేదా ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు. తద్వారా మన శరీరంలో యూవీబీ కిరణాలు అందవు. తద్వారా విటమిన్ డీ సహజసిద్ధంగా ఉత్పత్తి కాదు.