విటమిన్ బి12 కోసం మాంసాహారం మాత్రమే కాదు ఈ వెజ్ ఆప్షన్స్‌ కూడా బెస్ట్‌..!

Vitamin B12: విటమిన్ బి12 చాలా ముఖ్యమైన పోషకం. దీనికి సంబంధించిన ఆహారాలను సరైన మొత్తంలో తీసుకోకపోతే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది.

Update: 2022-10-07 10:10 GMT

విటమిన్ బి12 కోసం మాంసాహారం మాత్రమే కాదు ఈ వెజ్ ఆప్షన్స్‌ కూడా బెస్ట్‌..!

Vitamin B12: విటమిన్ బి12 చాలా ముఖ్యమైన పోషకం. దీనికి సంబంధించిన ఆహారాలను సరైన మొత్తంలో తీసుకోకపోతే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది. తొందరగా అలసిపోవడం, ఆఫీసులో కునుకు తీయడం ఈ విటమిన్‌ లోపం వల్ల జరుగుతుంది. మనం శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలంటే విటమిన్ బి12ను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకం రెడ్ మీట్, చికెన్, చేపలు, గుడ్లతో సహా అనేక రకాల నాన్ వెజ్ ఫుడ్స్‌లో లభిస్తుంది. అయితే శాఖాహారం తీసుకునే వారు భయపడాల్సిన అవసరం లేదు. వారికి కూడా మంచి ఎంపికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. పాలు

పాలను సంపూర్ణ ఆహారం అని చెబుతారు. దీనికి కారణం దాదాపు అన్ని రకాల పోషకాలు పాలలో ఉంటాయి. రోజూ ఉదయం, సాయంత్రం పాలు తాగితే శరీరం ఎప్పటికీ బలహీనపడదు.

2. పెరుగు

పెరుగు అనేది భారతదేశంలో ఎక్కువగా తినే పాల ఉత్పత్తి. ఇందులో విటమిన్ బి12తో పాటు విటమిన్ బి2 కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కాకుండా సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. పెరుగు తినడం వల్ల మీ శరీరానికి పూర్తి పోషణ లభిస్తుంది. అయితే తక్కువ కొవ్వు పెరుగు మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకి కారణం అవుతుంది.

3. ఓట్ మీల్

చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం పూట ఓట్ మీల్ తినాలని సూచిస్తారు. ఎందుకంటే దీనిని అల్పాహారంగా తీసుకున్న తర్వాత రోజంతా చురుకుగా ఉంటారు. ఇందులో విటమిన్ బి 12 ఉండటం వల్ల అలసట బారిన పడకుండా ఉంటాం.

Tags:    

Similar News