Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం లక్షణాలు, జాగ్రత్తలు – ఇలా చెక్ చేసుకోండి!

విటమిన్ బీ12 లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. బీ12 లోపిస్తే అలసట, వణుకు, చర్మం రంగు మారడం, కీళ్ల నొప్పులు, గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు చేపలు, గుడ్లు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాలు తీసుకోవాలి.

Update: 2025-09-12 09:10 GMT

Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం లక్షణాలు, జాగ్రత్తలు – ఇలా చెక్ చేసుకోండి!

బీ12 లోపం

బీ12 అనేది శరీరం సహజంగా ఉత్పత్తి చేసుకునే విటమిన్. అందుకే చాలామందిలో ఈ విటమిన్ ఎక్కువగా లోపిస్తుంటుంది. శరీరంలో బీ12 లోపించిందనడానికి సంకేతాలు ఏంటి? లోపాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.

వణుకు

బీ12 లోపం కారణంగా నరాలు బలహీనపడతాయి. తద్వారా కాళ్లు, చేతులు వణకడం లేదా తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే.. అది విటమిన్ బీ12 లోపంగా అనుమానించొచ్చు.

అలసట

బీ12 విటమిన్ లోపించినప్పుడు శరీర మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. తద్వారా తరచుగా అలసటకు లోనవుతుంటారు.

చర్మం రంగు

శరీరంలో బీ12 లోపిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా చర్మం రంగు మారుతుంది. పెదవులు పొడిబారడం, చర్మం లేత పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కీళ్ల నొప్పులు

ఎముకల ఆరోగ్యానికి విటమిన్ బీ12 చాలా అవసరం. అందుకే బీ12 లోపించినప్పుడు తరచుగా కీళ్లనొప్పులు, మెడ నొప్పి, వెన్ను నొప్పి వంటివి కలుగుతాయి.

హార్ట్ రేట్

బీ12 లోపంతో ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం కారణంగా గుండెకు రక్త సరఫరా తగ్గి హార్ట్ రేట్ పెరుగుతుంది. తరచుగా గుండె దడగా అనిపిస్తుంటే అది బీ12 లోపంగా అనుమానించొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

బీ12 లోపాన్ని అధిగమించడం కోసం చేపలు, మాంసం, పెరుగు, గుడ్లు, ఆకుకూరలు, యాపిల్, అరటి వంటివి ఎక్కువగా తినాలి. రోజూ కొంత సేపు ఎండలో నిల్చోవాలి.

Tags:    

Similar News