Vitamin B12: గుండె నుంచి మెదడు వరకు మేలు చేసే విటమిన్ B12 – లాభాలు, లభించే ఆహారాలు
శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరమే. వాటిలో ఏదో ఒకటి తగ్గినా ఆరోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా విటమిన్లు శరీరానికి అత్యంత కీలకం. గుండె నుంచి మెదడు వరకు మేలు చేసే ఒక ప్రత్యేకమైన విటమిన్ ఉంది — అదే విటమిన్ B12.

ఇది శరీరంలోని ప్రతి భాగానికి అవసరమయ్యే విటమిన్. దీని లోపం గుండె, మెదడు, ఎముకలు వంటి ముఖ్య అవయవాలకు హాని కలిగిస్తుంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా కాపాడుకోవాలి. ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ విటమిన్ మన శరీరంలో నిల్వ ఉండదు. అందువల్ల దాన్ని ప్రతిరోజూ ఆహారం ద్వారా తీసుకోవాలి. ఇది అలసటను తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, మానసిక స్థిరత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
NCBI సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 70 శాతం మందిలో విటమిన్ B12 లోపం ఉంది. కాబట్టి, దీని లాభాలు, అలాగే ఏ ఆహార పదార్థాల్లో ఇది లభిస్తుందో తెలుసుకోవడం ఎంతో అవసరం.