Vitamin B12 : మాంసాహారం తినకపోయినా B12 అందుతుంది..ఈ 4 రకాల ఆకు కూరలను అస్సలు మిస్ చేయకండి
Vitamin B12 : మానవ శరీరానికి ప్రతి పోషక పదార్థం చాలా ముఖ్యమైనది. వాటిలో కొద్దిపాటి లోపం ఉన్నా, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
Vitamin B12 : మాంసాహారం తినకపోయినా B12 అందుతుంది..ఈ 4 రకాల ఆకు కూరలను అస్సలు మిస్ చేయకండి
Vitamin B12: మానవ శరీరానికి ప్రతి పోషక పదార్థం చాలా ముఖ్యమైనది. వాటిలో కొద్దిపాటి లోపం ఉన్నా, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్ B12 ఒకటి. మన శరీరం ఈ విటమిన్‌ను సొంతంగా తయారు చేసుకోలేదు. అందుకే ఈ విటమిన్‌ను ఆహారాల ద్వారానే పొందాలి. ఈ విటమిన్ శాకాహార ఆహారాల నుంచి తక్కువగా లభిస్తుంది. అయితే కొన్ని ఆకు కూరలు విటమిన్ B12 కొరతను అధిగమించడానికి బాగా సహాయపడతాయి. ఆ ఆకు కూరలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శాకాహారులు విటమిన్ B12 కొరతను ఎదుర్కోకుండా ఉండటానికి ఈ నాలుగు ఆకు కూరలను తప్పకుండా తినాలి:
1. మునగాకు
సాధారణంగా మునగాకును పోషకాల శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. వీటిలో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. మునగాకును తరచుగా తినడం వల్ల శరీర బలహీనత తగ్గి, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది.
2. పాలకూర
పాలకూర తినడం వల్ల కూడా విటమిన్ B12 లభిస్తుంది. ఇది ఐరన్, ఫోలేట్ కు మంచి మూలం. పాలకూరను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల అలసట మరియు బద్ధకం వంటి సమస్యలను దూరం చేయవచ్చు.
3. తోటకూర
చలికాలంలో తోటకూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకు కూరలో విటమిన్ సీ, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. తోటకూరను తరచుగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఉండే విటమిన్ B12 లోపాన్ని నివారించడానికి వీలుంటుంది.
4. కరివేపాకు
మనం రోజువారీ వంటకాల్లో ఉపయోగించే కరివేపాకు కూడా విటమిన్ B12కు మంచి మూలం. కరివేపాకులో ప్రొటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, విటమిన్ B12 ఉంటాయి. ఇది చర్మం,జుట్టు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.