Smart Phone: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇట్టే బీపీ తెలుసుకోవచ్చు
Smart Phone: బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలంటే బీపీ మెషిన్ ఉండాల్సిందే. మారిన కాలంతో పాటు ఈ బీపీ మెషిన్స్‌లోనూ మార్పులు వచ్చాయి.
Smart Phone: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇట్టే బీపీ తెలుసుకోవచ్చు
Smart Phone: బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలంటే బీపీ మెషిన్ ఉండాల్సిందే. మారిన కాలంతో పాటు ఈ బీపీ మెషిన్స్‌లోనూ మార్పులు వచ్చాయి. చాలా స్టైలిష్ లుక్‌లో మెషిన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే ఎలాంటి మెషిన్ అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్‌తో బీపీ చెక్ చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ? దీనినే నిజం చేసింది ఓ కంపెనీ. ఇంతకీ ఏంటా యాప్? ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇకపై రక్తపోటు (బీపీ) కోసం ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేకుండా, స్మార్ట్‌ఫోన్ సహాయంతోనే తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డీగోకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు అభివృద్ధి చేసిన "Vibro" అనే కొత్త యాప్ ద్వారా ఇది సాధ్యం కానుంది. Vibro అనేది ఆసిలోమెట్రిక్ (Oscillometric) పద్ధతిలో పనిచేసే ఓ ప్రత్యేకమైన యాప్. స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా, వైబ్రేషన్ మానిటర్, మోషన్ సెన్సార్ సహాయంతో రక్తపోటును అంచనా వేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో లభించే బీపీ మానిటర్‌ల మాదిరిగా దీనికి చేతికి చుట్టే మాన్యువల్ కఫ్ఫ్ అవసరం ఉండదు.
ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే?
ఫోన్ స్క్రీన్‌పై వేళ్లను అనించాలి. అప్పుడు అక్కడ వైబ్రేషన్ తగ్గుముఖం పడుతుంది. వేర్వేరు స్థాయుల్లో వేళ్లతో ఒత్తిడి పెంచినప్పుడు, ఫోన్ అందించిన డేటాను ఆ యాప్ విశ్లేషిస్తుంది. కెమెరా సహాయంతో వేలి చివర భాగంలోని అతి సూక్ష్మ రక్తనాళాల మార్పులను గుర్తిస్తుంది. గుండె కొట్టుకునే వేగం, రక్త ప్రసరణ జరిగే స్థాయిని విశ్లేషించి బీపీని అంచనా వేస్తుంది.
ఈ డేటాను ప్రామాణిక కొలమానాలతో సరిపోల్చి, తక్కువ సమయంలోనే రక్తపోటును చూపిస్తుంది. ఈ నూతన సాంకేతికత ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా రక్తపోటును చెక్ చేసుకోవచ్చు. వైద్య పరిశోధనలో ఇది గొప్ప ఆవిష్కరణగా పరిశోధకులు చెబుతున్నారు.