Valentine’s Week 2025: ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ప్రేమికుల వారం.. ప్రేమ సందేశాలివే..!
Valentine’s Week 2025: ఫిబ్రవరి వచ్చేసరికి ప్రేమ వాతావరణం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచంలోని ప్రేమికులు వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు.
Valentine’s Week 2025: ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ప్రేమికుల వారం.. ప్రేమ సందేశాలివే..!
Valentine’s Week 2025: ఫిబ్రవరి వచ్చేసరికి ప్రేమ వాతావరణం మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచంలోని ప్రేమికులు వాలెంటైన్స్ డేను జరుపుకుంటారు. ఈ రోజున తమకు ఇష్టమైన వారికి తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తుంటారు. ప్రేమను ఎప్పుడూ ఎరుపు రంగుతో గుర్తిస్తారు. అందుకే ప్రేమికులు ఈ రోజున రెడ్ కలర్ రోజెస్ ఇచ్చిపుచ్చుకుంటారు. తమకు ఇష్టమైన వారికి ప్రత్యేక బహుమతులను అందజేస్తుంటారు. వాలెంటైన్స్ డే అనేది ఒకే రోజు మాత్రమే కాకుండా ఫిబ్రవరి నెలలో కొద్ది రోజుల పాటు కొనసాగే వాలెంటైన్స్ వీక్‌గా కూడా చాలా పాపులర్. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరుపుకుంటారు. ఇందులో ప్రతి రోజు ప్రేమ, సంబంధాల ప్రత్యేకతలను గుర్తించడానికి ప్రత్యేకంగా పేర్లు కూడా పెట్టారు.
వాలెంటైన్స్ వీక్ (ఫిబ్రవరి 7 నుండి 14)
ఫిబ్రవరి 7 – రోజ్ డే
వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో ప్రారంభం అవుతుంది. ఈ రోజున వివిధ రంగుల రోజాలను ఇవ్వడం ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఎరుపు గులాబీలు ప్రేమను, పసుపు స్నేహాన్ని, గులాబీ అధికారాన్ని, తెలుపు శాంతిని సూచిస్తుంది.
ఫిబ్రవరి 8 – ప్రపోజ్ డే
ఈ రోజున ప్రేమికులు తమ అసలైన భావాలను వ్యక్తం చేయడానికి తమ ప్రియమైన వ్యక్తికి ప్రపోజ్ చేస్తారు. ఇది వారి సంబంధాన్ని మరింత గాఢమైనదిగా మార్చుకునే సందర్భంగా దీనిని భావిస్తారు.
ఫిబ్రవరి 9 – చాక్లెట్ డే
ఈ రోజున జంటలు ఒకరినొకరు చాక్లెట్లు ఇచ్చి ప్రేమను గుర్తిస్తారు. చాక్లెట్ అనేది ఒక రొమాంటిక్ గెస్ట్ గా, ఒకరినొకరు ప్రేమతో పంచుకునే మార్గం.
ఫిబ్రవరి 10 – టెడీ డే
ఈ రోజున జంటలు టెడీ బియర్లు ఒకరికి మరొకరికి ఇచ్చి ప్రేమను గుర్తు చేసుకుంటారు.
ఫిబ్రవరి 11 – ప్రామిస్ డే
ఈ రోజున ప్రేమికులు తమ సంబంధాలను మరింత బలంగా చేసుకునేందుుకు వాగ్దానాలు చేసుకుంటారు.
ఫిబ్రవరి 12 – హగ్ డే
ఈ రోజు ప్రేమికులు ఒకరినొకరు ఆనందంగా గట్టిగా హగ్ చేసుకుంటారు. ఇది స్నేహం, ప్రేమను వ్యక్తపరిచే సులభమైన మార్గం.
ఫిబ్రవరి 13 – కిస్ డే
ఈ రోజున జంటలు ఒకరికి మరొకరికి రొమాంటిక్ కిస్ ఇవ్వడం ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తారు.
ఫిబ్రవరి 14 – వాలెంటైన్ డే
ప్రేమకు అంకితం చేసిన ఈ రోజు జంటలు ప్రేమికుల రోజును జరుపుకుంటారు. బహుమతులు, గిఫ్ట్ కార్డులతో వారి ప్రేమను ఎదుటి వారికి ప్రకటిస్తారు.
ఆంటీ-వాలెంటైన్ వీక్ (ఫిబ్రవరి 15 నుండి 21)
వాలెంటైన్స్ డే తరువాత, ఫిబ్రవరి 15 నుండి 21 వరకు ఆంటీ-వాలెంటైన్ వీక్ జరుపుకుంటారు. ఈ వీక్ హార్ట్ బ్రోకన్ లేదా సింగిల్ ఉన్న వారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వీక్‌లో ప్రతి రోజు ప్రత్యేకమైన సందేశం ఉంది. ఇది వాలెంటైన్స్ డే సందేశాలకు విరుద్ధంగా ఉంటుంది.
ఫిబ్రవరి 15 – స్లాప్ డే
ఈ రోజు టాక్సిక్ రిలేషన్‌షిప్స్ లేదా నెగటివ్ భావాలను తొలగించడానికి ఉద్దేశించారు.
ఫిబ్రవరి 16 – కిక్ డే
ఈ రోజు చెడు అలవాట్లను లేదా విషపూరిత సంబంధాలను తొలగించడం, వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది.
ఫిబ్రవరి 17 – పర్ఫ్యూమ్ డే
మీరు గిఫ్ట్ గా పర్ఫ్యూమ్ ఇస్తుంటారు. ఇది బ్రేకప్ తరువాత కూడా జీవితం కొత్తగా చిగురిస్తుందన్న దానికి సంకేతం.
ఫిబ్రవరి 18 – ఫ్లర్ట్ డే
ఈ రోజు సింగల్స్ తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, కొత్త పరిచయాలను స్వీకరించడానికి రెడీ అవుతారు.
ఫిబ్రవరి 19 – కన్‌ఫెషన్ డే
ఈ రోజు ప్రేమ, పశ్చాత్తాపం భావాలను వ్యక్తపరచడం, కొంతమంది సొంత నిర్ణయాలను పొందడానికి లేదా క్లాష్ క్లియర్ చేసేందుకు ఉపయోగిస్తారు.
ఫిబ్రవరి 20 – మిస్సింగ్ డే
కోల్పోయిన ప్రేమను గుర్తించే రోజు. ఇది భావోద్వేగ సుఖం కోసం ఉపయోగపడుతుంది.
ఫిబ్రవరి 21 – బ్రేకప్ డే
ఆంటీ-వాలెంటైన్ వీక్ చివరి రోజు, ఇది గతాన్ని మర్చిపోవడం, ఇండిపెండెంట్ గా ఆనందించడంపై దృష్టి పెట్టే రోజు.