Dental Health : పళ్ళు తెల్లగా, గట్టిగా ఉండాలంటే దీనితో రుద్దండి.. చాలా హెల్తీగా ఉంటాయి
ప్రతిరోజూ ఉదయం, రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. మెరిసే పళ్ల కోసం రకరకాల టూత్‌పేస్టులు వాడుతుంటాం. కానీ, దీనివల్ల పళ్లు పసుపు రంగులోకి మారడం, చిగుళ్లు బలహీనపడటం జరుగుతుందని చాలామందికి తెలియదు. అయితే, మన పూర్వీకులు టూత్‌పేస్టులు వాడేవారు కాదు.
Dental Health : పళ్ళు తెల్లగా, గట్టిగా ఉండాలంటే దీనితో రుద్దండి.. చాలా హెల్తీగా ఉంటాయి
Dental Health : ప్రతిరోజూ ఉదయం, రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. మెరిసే పళ్ల కోసం రకరకాల టూత్‌పేస్టులు వాడుతుంటాం. కానీ, దీనివల్ల పళ్లు పసుపు రంగులోకి మారడం, చిగుళ్లు బలహీనపడటం జరుగుతుందని చాలామందికి తెలియదు. అయితే, మన పూర్వీకులు టూత్‌పేస్టులు వాడేవారు కాదు. అందుకు బదులుగా వేప, అకాసియా వంటి నేచురల్ పుల్లలను ఉపయోగించేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని పాటిస్తున్నారు. వారి పళ్లు ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి.
వేప, అకాసియా లేదా కరంజా వంటి చెట్ల కొమ్మలు ఒక నేచురల్ టూత్ బ్రష్ మాదిరి పని చేస్తాయి. దీనిని నమలడం వల్ల పళ్లు శుభ్రం అవుతాయి. చిగుళ్లకు మంచి మసాజ్ లభిస్తుంది. అంతేకాకుండా, ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. టూత్ బ్రష్‌లు, కెమికల్ పేస్టులు అందుబాటులో లేనప్పుడు, ఈ పళ్ల పుల్లను ఉపయోగించేవారు.
దీని ప్రయోజనాలు:
సహజ యాంటీసెప్టిక్: వేప, అకాసియా పుల్లలకు యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి.
నేచురల్ ఫ్లోసింగ్: ఈ పల్లలను నమలడం వల్ల వచ్చే పీచు పళ్ల మధ్యలోకి వెళ్లి ఇరుక్కున్న ఆహారం, ప్లేక్‌ను తొలగిస్తుంది.
చిగుళ్లకు బలం: పళ్ల పుల్ల చిగుళ్లకు నెమ్మదిగా మసాజ్ చేస్తుంది, దీనివల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చిగుళ్లు బలంగా మారతాయి.
పసుపు రంగు పోతుంది: క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల పళ్లపై ఉన్న పసుపు రంగు పోయి అవి తెల్లగా మారుతాయి.
నోటి దుర్వాసన తగ్గుతుంది: ఈ పళ్ల పుల్లలు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తాయి.
ఎలా ఉపయోగించాలి?
ఉదయం పూట వేప లేదా అకాసియా చెట్టు సన్నని కొమ్మను తీసుకోవాలి. దాని ఒక చివరను నమలండి, అది పీచులా మారుతుంది. ఆ తర్వాత ఆ పీచుతో పళ్లపై నెమ్మదిగా రుద్దండి, చిగుళ్లకు మసాజ్ చేయండి. రోజుకు ఒకసారి ఉపయోగించడం సరిపోతుంది.