Dark Circles : కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకొస్తాయి? నిద్రలేక కాదు.. చాలా కారణాలున్నాయి!

Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది కేవలం మీ అందాన్ని మాత్రమే కాకుండా, కొన్నిసార్లు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Update: 2025-06-14 10:30 GMT

Dark Circles : కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకొస్తాయి? నిద్రలేక కాదు.. చాలా కారణాలున్నాయి!

Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది కేవలం మీ అందాన్ని మాత్రమే కాకుండా, కొన్నిసార్లు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని మనం తెలియకుండానే చేసే పనులు కాగా, మరికొన్ని వ్యాధులు లేదా పోషకాల లోపాల వల్ల కూడా వస్తుంటాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏ వ్యాధుల వల్ల వస్తాయి. వాటిని ఎలా సరిచేసుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.

నిద్రలేమి, స్క్రీన్ వాడకం

సాధారణంగా, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి. అంటే, సరిపడా నిద్ర లేకపోవడం లేదా నిద్ర పూర్తి కాకపోవడం. చాలా మంది తెలియకుండానే ఈ సమస్యను కొని తెచ్చుకుంటారు. అంతేకాకుండా, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు వంటి స్క్రీన్లను ఎక్కువ సమయం చూడడం వల్ల కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉండటం వల్ల కొంతమందికి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది.

ఈ వ్యాధులు ఉంటే కూడా నల్లటి వలయాలు వస్తాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చని నిపుణులు తెలిపారు. రక్తహీనత ఉన్నవారిలో తరచుగా కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపిస్తాయి. కాలేయ సమస్యలు ఉన్నవారికి కూడా కళ్ళ కింద నల్లటి వలయాలు రావొచ్చు. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోయినా కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపించే అవకాశం ఉంది.

వీటితో పాటు శరీరంలో నీటి కొరత, ధూమపానం , అతిగా మద్యం సేవించడం, ఒత్తిడి వంటివి కూడా కళ్ళ కింద నల్లటి వలయాలకు దారితీయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. సమతుల్యమైన, పౌష్టిక ఆహారం తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు మేలు చేస్తాయి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. శరీరం డిహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ధూమపానం, అతిగా మద్యం సేవించడం వంటి అలవాట్లను తగ్గించుకోవాలి.

Tags:    

Similar News