Cockroaches: బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇవి పాటిస్తే చాలు..!

Cockroaches: వంటగదిలో బొద్దింక ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆహారాన్ని పాడు చేస్తుంది.

Update: 2022-08-18 12:45 GMT

Cockroaches: బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇవి పాటిస్తే చాలు..!

Cockroaches: వంటగదిలో బొద్దింక ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆహారాన్ని పాడు చేస్తుంది. బొద్దింకలు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. మీ వంటగదిలో బొద్దింకలు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీటి గురంచి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చిట్కాలు పాటిస్తే బొద్దింకలని తరిమికొట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1.కిరోసిన్

మీరు మీ వంటగది నుంచి బొద్దింకలను తరిమికొట్టాలంటే కిరోసిన్ సహాయం తీసుకోవచ్చు. బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలని గుర్తించండి. అక్కడ కిరోసిన్‌ చల్లండి. కిరోసిన్ వాసనకు బొద్దింకలు వంటగది నుంచి పారిపోతాయి. అయితే మీరు కిరోసిన్ స్ప్రే చేసినప్పుడు చర్మాన్ని కప్పి ఉంచాలని గుర్తుంచుకోండి.

2.వేప

ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి అద్భుతమైన మార్గం ఉంది. వేపఆకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మీరు ఇంటి నుంచి బొద్దింకలను తరిమికొట్టాలంటే వేప ఆకు బాగా ఉపయోగపడుతుంది. వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ వేప నీటిని బొద్దింక ఉన్న ప్రదేశాలలో చల్లాలి. ఈ ట్రిక్ తో బొద్దింకలు వంటగది నుంచి దూరంగా ఉంటాయి.

3.బేకింగ్ సోడా

ఇంట్లో నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బొద్దింకలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంటే బేకింగ్ సోడాలో పంచదార మిక్స్ చేసి ఒక మిశ్రమంలా చేసుకోవాలి. తరువాత బొద్దింకలు ఎక్కువగా వచ్చే చోట ఈ మిశ్రమాన్ని చల్లాలి. చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది కానీ బేకింగ్ సోడాతో కలిపితే విషంలా పనిచేసి అవి చనిపోతాయి. ఇలా చేస్తే బొద్దింకలు బెడద తొలగిపోతుంది.

Tags:    

Similar News