Yoga: యోగాకు ఈ ప్రాంతాలు పెట్టింది పేరు.. మర్చిపోలేని అనుభూతి ఖాయం
International Yoga Day 2025: ప్రపంచానికి యోగా అనే గొప్ప బహుమతిని ఇచ్చిన ఘనత మన దేశానిది. శరీరాన్ని, మనుస్సును ఏకంగా చేసే యోగాకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత లభిస్తోంది. ఇందులో భాగంగానే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Yoga: యోగాకు ఈ ప్రాంతాలు పెట్టింది పేరు.. మర్చిపోలేని అనుభూతి ఖాయం
International Yoga Day 2025: ప్రపంచానికి యోగా అనే గొప్ప బహుమతిని ఇచ్చిన ఘనత మన దేశానిది. శరీరాన్ని, మనుస్సును ఏకంగా చేసే యోగాకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత లభిస్తోంది. ఇందులో భాగంగానే జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు కొన్ని ప్రాంతాల్లో యోగా చేస్తే చాలా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
కొండల మధ్య శాంతమైన వాతావరణంలో యోగా సాధన చేయాలనుకునే వారికి ధర్మశాల ఉత్తమమైన ఎంపిక. భాగ్సు యోగా సెంటర్, సిద్ధి యోగా, యూనివర్సల్ యోగా సెంటర్, యోగా ఇండియా వంటి ప్రసిద్ధ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి అందాల మధ్య ధ్యానం, శ్వాస పద్ధతులు అభ్యసించడం వల్ల దైహిక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.
రిషికేశ్, ఉత్తరాఖండ్
యోగా ప్రేమికులెవరికైనా రిషికేశ్ ఒక కలల ప్రదేశం. గంగా నది ఒడ్డున ఉన్న ఈ పట్టణాన్ని ‘యోగ రాజధాని’గా పిలుస్తారు. ఇక్కడి పవిత్రత, ప్రశాంతత యోగ సాధనకు ఎంతో సహకరిస్తాయి. పరమార్థ నికేతన్, శివానంద ఆశ్రమం, సాధన మందిరం, హిమాలయ యోగా ఆశ్రమం వంటి ప్రసిద్ధ యోగా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
కేరళ
ప్రకృతితో ముడిపడిన జీవనశైలికి కేరళ ఒక ప్రతీక. ఆయుర్వేద చికిత్సలు, యోగా అభ్యాసానికి పెట్టింది పేరు. శివ ఋషి యోగా, ఏకం యోగ శాల, ఋషికేశ్ యోగాపీఠ్ వంటి సంస్థలు ఇక్కడ యోగా శిక్షణను అందిస్తున్నాయి. శరీరానికి, మనస్సుకు ఒకే సమయలో విశ్రాంతిని అందించాలనుకునే వారికి ఇది ఉత్తమమైన గమ్యంగా చెప్పొచ్చు.
గోవా
గోవా కేవలం బీచ్‌లు, పార్టీలకే కాదు యోగా అభ్యాసానికి కూడా బెస్ట్ ప్లేస్‌గా చెప్పొచ్చు. సముద్రతీరాలు, పచ్చని పరిసరాలు ప్రశాంతంగా యోగా చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. త్రిమూర్తి యోగా సెంటర్, బాంబూ యోగా రిట్రీట్, లోటస్ నేచర్ కేర్ వంటి కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగా అభ్యాసకులను ఆకర్షిస్తున్నాయి.
పాండిచ్చేరి
తమిళనాడులోని ఈ సుందర నగరం ధ్యానానికి, యోగాకు ప్రసిద్ధి చెందింది. చందు ఆశ్రమం, తిరుమూలర్ యోగా కేంద్రం, ఆనందమయ యోగా కేంద్రాలు ఇక్కడ ప్రసిద్ధి. సముద్రపు గాలి, ప్రశాంత వీధులు, అందమైన మధ్యధరా శైలి నిర్మాణాలు, ఇవన్నీ కలిపి యోగా సాధనాన్ని మరింత విశేషంగా మారుస్తాయి.