Beauty Tips: చర్మ సంరక్షణలో పుదీనా సూపర్‌.. ఈ విధంగా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం..!

Beauty Tips: పుదీనా ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Update: 2023-03-16 08:40 GMT

Beauty Tips: చర్మ సంరక్షణలో పుదీనా సూపర్‌.. ఈ విధంగా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం..!

Beauty Tips: పుదీనా ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ నయం చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మం చికాకును తొలగిస్తుంది. చర్మంపై సహజమైన మెరుపును తీసుకురావడానికి పనిచేస్తుంది. పుదీన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీనిని చర్మానికి ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

పుదీనా, రోజ్ వాటర్

కొద్దిగా పుదీనా ఆకులని తీసుకొని గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ కలపాలి. ఈ పేస్టుని ముఖం, మెడపై బాగా అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు చర్మంపై ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.

పుదీనా, నిమ్మకాయ

కొద్దిగా పుదీనా ఆకులని తీసుకొని గ్రైండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ రెండింటినీ మిక్స్ చేసి ముఖం, మెడపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తే చర్మం మెరుస్తుంది.

పుదీనా, పెరుగు

కొద్దిగా పుదీనా ఆకులని తీసుకొని గ్రైండర్‌లో వేసి రుబ్బుకోవాలి. దీనికి ఒక చెంచా పెరుగు కలపాలి. అలాగే కొన్ని చుక్కల నీరు కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

పుదీనా, తేనె

కొద్దిగా పుదీనా ఆకులని తీసుకొని గ్రైండర్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీనికి నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. వీటిని బాగా మిక్స్‌ చేసి ముఖం, మెడపై అప్లై చేయాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగిస్తే చర్మం ఎక్స్‌పోలియేట్‌ అవుతుంది.

Tags:    

Similar News