Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ నాలుగు అలవాట్లను మీ లైఫ్ స్టైల్‌లో చేర్చుకోండి.. దెబ్బకు సమస్యలు పరార్
Overthinking: నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది అతిగా ఆలోచించడం అంటే అవసరానికి మించి ఆలోచించడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ నాలుగు అలవాట్లను మీ లైఫ్ స్టైల్‌లో చేర్చుకోండి.. దెబ్బకు సమస్యలు పరార్
Overthinking: నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది అతిగా ఆలోచించడం అంటే అవసరానికి మించి ఆలోచించడం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం, భవిష్యత్తు గురించి చింతించడం లేదా పాత సంఘటనల గురించి కలత చెందడం మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతాయి. అతిగా ఆలోచించడాన్ని నియంత్రించడానికి కొన్ని సాధారణ అలవాట్లను మీ లైఫ్ స్టైల్‌లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డైరీ రాయండి
ఒకేసారి చాలా ఆలోచనలు మీ మనసులోకి వచ్చినప్పుడు వాటిని కాగితంపై రాయడం అలవాటు చేసుకోండి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆలోచనలు, చింతలు లేదా భయాలను డైరీలో రాయడం వల్ల మీ మనసు తేలికవుతుంది. మీ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ అతిగా ఆలోచించడాన్ని తగ్గించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ 10-15 నిమిషాలు మీ భావాలను, ఆలోచనలను డైరీలో రాయండి. ఇది మనసును ప్రశాంతంగా ఉండేలా చేయడంతో పాటు అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది.
వర్తమానంలో జీవించండి
అతిగా ఆలోచించడానికి ప్రధాన కారణం భవిష్యత్తు గురించి చింతించడం లేదా గతాన్ని పదే పదే గుర్తుంచుకోవడం. వర్తమానంలో జీవించే అలవాటు ఈ సమస్యను తగ్గించగలదు. వర్తమానంపై దృష్టి పెట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనల భారం తగ్గుతుంది. ప్రతిరోజూ 5-10 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు చేస్తున్న పని గురించి మాత్రమే ఆలోచించండి.
స్క్రీన్ సమయాన్ని తగ్గించండి
ఖాళీ సమయంలో ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం, ముఖ్యంగా సోషల్ మీడియా అతిగా ఆలోచించడాన్ని ప్రోత్సహిస్తుంది. సోషల్ మీడియాలో ఇతరులతో మీ జీవితాన్ని పోల్చడం లేదా ప్రతికూల వార్తలు చదవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. రోజుకు 1-2 గంటలు మీ కోసం సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో మీకు ఇష్టమైన పని చేయండి, సంగీతం వినడం, పుస్తకం చదవడం లేదా తోటపని చేయడం వంటివి చేయండి.
స్నేహితులతో మాట్లాడండి
మీ మనసు భారంగా అనిపించినప్పుడు మీ ఆలోచనలను సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యునితో పంచుకోండి. సంభాషణ మనసును తేలికపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.