Vastu Tips: మీ మొబైల్ ఫోన్‌లో ఇలాంటి వాల్‌పేపర్‌ను ఉంచుతున్నారా.. బీ కేర్‌ ఫుల్.. శని మిమ్మల్ని వెంటాడుతుంది..!

Vastu Tips: మీ మొబైల్ ఫోన్‌లో ఇలాంటి వాల్‌పేపర్‌ను ఉంచుతున్నారా.. బీ కేర్‌ ఫుల్.. శని మిమ్మల్ని వెంటాడుతుంది..!
x
Highlights

Vastu Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో మతపరమైన చిత్రాలను వాల్‌పేపర్‌గా ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే, చాలా సార్లు మనం మురికి చేతులతో మన మొబైల్ ఫోన్‌ను తీసుకుంటాము.

Vastu Tips: మన జీవితాల్లో వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు లేదా చేసేటప్పుడు వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను పాటిస్తే దాని ఫలితాలు చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటాయని చెబుతారు. అదే సమయంలో ఈ నియమాలను విస్మరించినప్పుడు పరిణామాలు కూడా అంతే దారుణంగా ఉంటాయి. అయితే, చాలా మంది ఏ మాత్రం ఆలోచించకుండా తమ మొబైల్ ఫోన్‌లో తమకు నచ్చిన వాల్‌పేపర్‌ను

పెట్టుకుంటారు. అయితే, ఏదైనా వాల్‌పేపర్‌ను సెట్ చేసుకునే ముందు వాస్తు నియమాలను పాటించడం కూడా అవసరం. కాబట్టి, ఈ రోజు మనం స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి వాల్‌పేపర్‌లను ఉపయోగించకూడదు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మతపరమైన చిత్రాలు..

మీ స్మార్ట్‌ఫోన్‌లో మతపరమైన చిత్రాలను వాల్‌పేపర్‌గా ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే, చాలా సార్లు మనం మురికి చేతులతో మన మొబైల్ ఫోన్‌ను తీసుకుంటాము. అంతేకాకుండా మనం స్మార్ట్‌ఫోన్‌ను బాత్రూమ్‌కు కూడా తీసుకెళ్తాము.మీరు ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే దేవుణ్ణి అవమానిస్తున్నారు. దీని వల్ల మీ జీవితంపై చాలా ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి, మీ ఫోన్‌లో ఎప్పుడూ కూడా మతపరమైన ఫొటోలను వాల్‌పేపర్‌గా ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ మొబైల్ ఫోన్‌లో దేవుళ్లు, దేవతల చిత్రాలను ఉంచుకుంటే అది మీకు గ్రహ దోషాలను కలిగిస్తుంది.

భావోద్వేగం చిత్రాలు..

మీ స్మార్ట్‌ఫోన్‌లో భావోద్వేగాలను చూపించే వాల్‌పేపర్‌లను మీరు ఎప్పుడూ ఉంచకూడదు. చాలా సార్లు మనం ఆనందం, విచారం, కోపం, అసూయ లేదా దురాశను వర్ణించే వాల్‌పేపర్‌లను పెడతాము. పొరపాటున కూడా మీరు భావోద్వేగాల చిత్రాలను వాల్‌పేపర్‌గా పెట్టుకోకూడదు.మీరు అలాంటి వాల్‌పేపర్‌లను ఉంచినప్పుడు అది మీ జీవితంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఈ వాల్‌పేపర్‌ల వల్ల మీరు డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళవచ్చు.కాబట్టి, ఎట్టిపరిస్థితిలోనూ భావోద్వేగానికి సంబంధించిన ఫొటోలను వాల్‌పేపర్‌గా పెట్టుకోకండి.

ఈ కలర్స్ కూడా..

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఎప్పుడూ కూడా నలుపు, నీలం, గోధుమ లేదా ఊదా రంగు వాల్‌పేపర్‌ను ఉంచకూడదు. మీరు అలాంటి తప్పు చేస్తే జీవితంలో విజయం సాధించలేరు. మీరు జీవితంలో వ్యాపారంలో పురోగతి సాధించాలనుకుంటే ఈ రంగుల వాల్‌పేపర్‌లను ఎప్పుడూ యూజ్ చేయకూడదని వాస్తు శాస్త్ర నిపణులు హెచ్చరిస్తున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఆన్‌లైన్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. HMTV Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Show Full Article
Print Article
Next Story
More Stories