Calcium Rich Foods: పాలలో కంటే ఈ పప్పులో కాల్షియం ఎక్కువ..!

Calcium Rich Foods: పాలలో కంటే ఈ పప్పులో కాల్షియం ఎక్కువ..!

Update: 2022-09-18 07:09 GMT

Calcium Rich Foods: పాలలో కంటే ఈ పప్పులో కాల్షియం ఎక్కువ..!

Calcium Rich Foods: కాల్షియం మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎముకలు, దంతాలకు బలాన్ని అందిస్తుంది. కాల్షియం లోపం ఉంటే శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. రోజంతా సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టం. ఇది కాకుండా ఇది రక్తం గడ్డకట్టడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె కొట్టుకోవడం, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయించడంలో సహాయపడుతుంది. అయితే కాల్షియం ఎందులో ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం.

పాలలో కంటే ఎక్కువ కాల్షియం

పాలు కాల్షియానికి గొప్ప వనరని అందరికి తెలుసు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు పాలు తాగమని సలహా ఇస్తారు. కానీ తాజా అధ్యయనంలో పొట్టుతో ఉన్న పప్పులో కాల్షియం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కానీ దీనిని ఎక్కువగా పశుగ్రాసంలో ఉపయోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) ప్రకారం

పాలలో కంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం పొట్టుతో ఉన్న పప్పులో ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, రికెట్స్‌కు ఉపయోగపడుతుంది.

ICRISATలో నిర్వహించిన పరిశోధన ప్రకారం పాల కంటే పొట్టుతో ఉన్న పప్పులో ఎక్కువ కాల్షియం కనుగొన్నారు. ఇది శిశువు ఆహారం, మినరల్ సప్లిమెంట్లకు ముఖ్యమైనదని నిరూపించవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం కేవలం 100 గ్రాముల పొట్టుతో ఉన్న పప్పులో 652 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. అయితే 100 మిల్లీలీటర్ల పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. మన శరీరానికి ప్రతిరోజూ 800-1,000 mg కాల్షియం అవసరం. కాబట్టి కాల్షియం సరైన ఎంపికను ఎంచుకోవడం ముఖ్యం.

Tags:    

Similar News