Vitamins: ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కచ్చితంగా తీసుకోవాలి..!

Vitamins: ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కచ్చితంగా తీసుకోవాలి..!

Update: 2022-07-21 03:00 GMT

Vitamins: ఈ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కచ్చితంగా తీసుకోవాలి..!

Vitamins: వర్షాకాలంలో వ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మరోవైపు కరోనా కూడా ఉండనే ఉంది. అందుకే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం ముఖ్యం. రోగనిరోధక శక్తి కలిగి ఉండటం అవసరం. ఇందుకోసం మీరు విటమిన్ డి, సి, జింక్ తీసుకోవాలి. ఇవి శరీరాన్ని బలంగా చేయడానికి ఉపయోగపడుతాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెరగడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం.

విటమిన్ డి

శరీరంలోని ఏదైనా భాగంలో వాపులు ఉంటే విటమిన్ డి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం లోపల జరిగే నష్టాన్ని తొలగిస్తుంది. ఒకవేళ విటమిన్‌ డి లోపిస్తే, ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండే అవకాశాలు ఉంటాయి.

విటమిన్ సి

తెల్ల రక్త కణాలకు విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది కణాలను చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

జింక్

రోగనిరోధక వ్యవస్థకు జింక్ చాలా ముఖ్యమైనది. అది లేకుండా తెల్ల రక్త కణాలు తయారు కావు. శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే జింక్, విటమిన్‌ సి, డి కలిసి నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News