Sleep: కంటినిండా కునుకు కోసం ఈ మూడు పానీయాలు.. ఏంటంటే..?

Sleep: కంటినిండా కునుకు కోసం ఈ మూడు పానీయాలు.. ఏంటంటే..?

Update: 2022-02-05 09:00 GMT

Sleep: కంటినిండా కునుకు కోసం ఈ మూడు పానీయాలు.. ఏంటంటే..?

Sleep: ప్రస్తుతం చాలామంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కొంతమంది పని ఒత్తిడితో నిద్రకి దూరం అవుతుంటే మరికొంతమంది గాడ్జెట్స్‌ వల్ల సరైన నిద్రపోలేకపోతున్నారు. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ డబ్బులు ఖర్చుచేసుకుంటున్నారు. అయితే మంచినిద్ర కోసం జీవన విధానంలో కొద్దిగా మార్పులు చేసే సరిపోతుంది. అంతేకాకుండా పడుకునే ముందు ఈ మూడు పానీయాలు తీసుకుంటే నిద్ర దానికదే కమ్ముకొస్తుంది. ఆ పానీయాల గురించి చూద్దాం.

పడుకునే ముందు పాలు తాగితే మీరు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పారు. అందుకే చాలామంది పడుకునే ముందు పాలు తాగుతారు. ప్రాచీన కాలం నుంచి ఈ పద్దతిని పాటిస్తున్నారు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది ఇది సహజ నిద్రని ప్రేరేపిస్తుంది ఒత్తిడి, టెన్షన్‌లని తగ్గిస్తుంది. నిద్ర రుగ్మతలను తగ్గిస్తుంది. అయితే ఇందులో కొంచెం పసుపు వేసుకొని తాగితే శరీరాఆనికి చాలా మంచిది. ఎందుకంటే పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మూలికలలో నెంబర్ వన్ అశ్వగంధ. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నిద్రకి బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి తగ్గించడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఒత్తిడి హార్మోన్ అని పిలువబడే కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఒక కప్పు అశ్వగంధ టీతో నిద్రలేమిని అధిగమించవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక కప్పు అశ్వగంధ టీని తయారుచేసి తాగితే నిద్ర కమ్ముకొస్తుంది.

నిద్రకి కశ్మీరి టీ కూడా తాగవచ్చు. జీడిపప్పు, ఖర్జూరాలు వంటి ఎండిన పండ్లతో ఈ టీని తయారు చేస్తారు. గ్రీన్ టీ ఆకులు, కుంకుమపువ్వు, దాల్చినచెక్క, ఏలకులు, లవంగాల మిశ్రమాన్ని కలుపుతారు. దీంతో ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. చలికాలం నిద్ర కోసం ఈ టీ తాగవచ్చు. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా నిద్ర సమస్యని కూడా తగ్గిస్తుంది. 

Tags:    

Similar News