Diabetes: ఉద‌యం లేవ‌గానే ఈ ల‌క్ష‌ణాలా.? డ‌యాబెటిస్ కావొచ్చు

Diabetes: డయాబెటిస్ (మధుమేహం) అనేది ఆహారం, శరీరాన్ని కదిలించని జీవనశైలి, ఒత్తిడి లాంటి కారణాల వ‌ల్ల‌ వచ్చే జీవనశైలి సంబంధిత వ్యాధి. ఈ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే, సరైన నియంత్రణతో ఆరోగ్యంగా జీవించొచ్చు.

Update: 2025-06-07 00:18 GMT

Diabetes: ఉద‌యం లేవ‌గానే ఈ ల‌క్ష‌ణాలా.? డ‌యాబెటిస్ కావొచ్చు

Diabetes: డయాబెటిస్ (మధుమేహం) అనేది ఆహారం, శరీరాన్ని కదిలించని జీవనశైలి, ఒత్తిడి లాంటి కారణాల వ‌ల్ల‌ వచ్చే జీవనశైలి సంబంధిత వ్యాధి. ఈ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే, సరైన నియంత్రణతో ఆరోగ్యంగా జీవించొచ్చు. ఉదయం వేళ కనిపించే కొన్ని లక్షణాలు మధుమేహానికి సంకేతాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన

రాత్రి సమయంలో నీరు ఎక్కువగా తాగినా, ఉదయం లేవగానే తీవ్రమైన దాహం వేస్తే, అది మధుమేహం సూచన కావొచ్చు. అలాగే, రాత్రిపూట తరచూ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఇది ఆందోళనకర సంకేతంగా భావించాలి.

ఉదయం అలసట

రాత్రంతా విశ్రాంతిగా నిద్రపోయినా, ఉదయం లేచిన వెంటనే శరీరంలో శక్తి లేకపోవడం, నీరసంగా అనిపించడం కూడా షుగర్ లెవెల్స్ పెరిగిన సూచన కావొచ్చు.

చూపులో మార్పులు

ఉదయం కనుల ముందు మసకదనం, వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం కూడా డయాబెటిస్ లక్షణం. రక్తంలో షుగర్ అధికంగా ఉన్నప్పుడు కళ్లపై ప్రభావం పడుతుంది.

చిన్న గాయాలు మానకపోవడం

సాధారణంగా చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో రక్త ప్రసరణ ప్రభావితమవడం వల్ల గాయాలు నెమ్మదిగా మానుతాయి. ఇది ఇమ్యూనిటీ తగ్గిపోవడానికీ సంకేతం.

అకారణంగా బరువు తగ్గటం

ఆహారపు అలవాట్లు మారకపోయినా, శారీరక శ్రమ తగ్గకపోయినా బరువు తగ్గిపోతుంటే, అది షుగర్ సమస్య కారణమై ఉండొచ్చు. ఇది తక్షణంగా వైద్యసలహా తీసుకోవాల్సిన పరిస్థితి.

ముందస్తు జాగ్రత్తలు, నియంత్రణ

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. వ్యాయామాన్ని అల‌వాటు చేసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.

కాలానికి తగినట్లుగా బ్లడ్ షుగర్ టెస్టులు చేయించుకోవాలి. ఈ సూచనలను పాటించడం ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు.

Tags:    

Similar News