Eggs: ఈ వ్యక్తులు పొరపాటున కూడా గుడ్లు తినకూడదు..!
Eggs: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇనుము, B12, విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి.
Eggs: ఈ వ్యక్తులు పొరపాటున కూడా గుడ్లు తినకూడదు..!
Eggs: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తరచూ చెబుతుంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇనుము, B12, విటమిన్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. అందుకే చాలా మంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు. వీటిని అనేక రకాలుగా చేసుకుని తినవచ్చు. పెరుగుతున్న పిల్లలకు గుడ్డు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అథ్లెట్లు కూడా దీనిని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే గుడ్లు కండరాలను నిర్మించడానికి, కంటి చూపు, రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయపడతాయి. అయితే, ఈ సమస్యలతో బాధపడేవారికి గుడ్డు హానికరమని నిపుణులు చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలు
మీకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఉంటే మీరు గుడ్లు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి, ఈ సమస్యతో బాధపడేవారు గుడ్లు తినే విషయంలో వైద్యుడి సలహా తీసుకోండి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు
చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుడ్డులో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ దాని వినియోగం కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనను తినకుండా ఉండాలి.
అలెర్జీ ఉన్నవారు
కొంతమందికి గుడ్డు అంటే అలెర్జీ ఉంటుంది. అలాంటి సందర్భంలో గుడ్లు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గుడ్లు తిన్న తర్వాత మీకు కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల, మీరు వీటిని తినే ముందు వైద్యుడి సలహా తీసుకోండి.
ఊబకాయం
గుడ్డు ప్రోటీన్ మూలం అయినప్పటికీ మీరు ఊబకాయంతో బాధపడుతుంటే మీరు దానిని తినకుండా ఉండాలి. ఎందుకంటే మీరు మరింత బరువు పెరగవచ్చు. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్నట్లయితే గుడ్లు తినవచ్చు కానీ గుడ్డులోని సోనని తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.