Beauty Tips: ఈ ఆయిల్స్‌ చర్మానికి చాలా మేలు చేస్తాయి.. కానీ ఎలా ఉపయోగించాలంటే..?

Beauty Tips: చర్మ సంరక్షణకి కొన్నిరకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి.

Update: 2023-03-17 01:30 GMT

Beauty Tips: ఈ ఆయిల్స్‌ చర్మానికి చాలా మేలు చేస్తాయి.. కానీ ఎలా ఉపయోగించాలంటే..?

Beauty Tips: చర్మ సంరక్షణకి కొన్నిరకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి. బ్యూటీ ప్రొడక్ట్‌ల తయారీలో ఈ నూనెలని ఎక్కువగా వాడుతారు. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఈ నూనెలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నూనెలను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖంపై మొటిమలు ఉండవు . చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అంతేకాదు వృద్ధాప్య సంకేతాలు చర్మంపై కనిపించవు. అయితే ఇవి ఎలాంటి నూనెలో ఈరోజు తెలుసుకుందాం.

లెమన్ ఎసెన్షియల్ ఆయిల్: లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ మొటిమలని, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరినూనెతో కలిపి ఈ నూనెను సులభంగా అప్లై చేసుకోవచ్చు. మంచి ఫలితాలు ఉంటాయి.

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్: ఈ ముఖ్యమైన నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. తగిన పోషణని అందిస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మంలోని మచ్చలు తొలగిపోతాయి. కొన్ని రోజుల్లోనే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి.

శాండల్‌వుడ్ ఎసెన్షియల్ ఆయిల్: శాండల్‌వుడ్ స్కిన్ ఆయిల్ చర్మానికి చాలా మంచిది. ఈ నూనెను ఏ రకమైన చర్మానికైనా సులభంగా అప్లై చేయవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు ముఖం ఛాయని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

పుదీనా ఎసెన్షియల్ ఆయిల్: పుదీనా ఎసెన్షియల్ ఆయిల్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ముఖంపై ఉపయోగించడం వల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. వృద్దాప్య ఛాయలని నెమ్మదిస్తుంది. చర్మాన్ని చల్లబరిచే గుణాలు ఇందులో ఉంటాయి. ప్రతిరోజు ఉపయోగిస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

Tags:    

Similar News