Health Tips: చలికాలంలో వీటిని తినకూడదు.. గుండెకు చాలా ప్రమాదం..!

* ఈ సమస్యల నుంచి బయటపడేందుకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.

Update: 2022-12-25 16:00 GMT

Health Tips: చలికాలంలో వీటిని తినకూడదు.. గుండెకు చాలా ప్రమాదం..!

Health Tips: వింటర్ సీజన్‌ అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. చల్లని కాలం ఫంగస్, బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన సమయం. వీటి పెరుగుదల కారణంగా సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. చలికాలంలో ఐస్ క్రీం, టీ, కాఫీ వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు ఏర్పడుతాయి.

2. చలికాలంలో చాలా మంది రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు. రెడ్ మీట్‌లో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీనికి బదులుగా చేపలను తినవచ్చు.

3. చలికాలంలో ప్రజలు వేయించిన ఆహారాలని ఎక్కువగా తింటారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ను తక్కువగా తినాలి.

Tags:    

Similar News