Health Tips: ఇవి అధిక కొవ్వుని తగ్గిస్తాయి.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..!

Health Tips: ఇవి అధిక కొవ్వుని తగ్గిస్తాయి.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..!

Update: 2023-05-17 08:30 GMT

Health Tips: ఇవి అధిక కొవ్వుని తగ్గిస్తాయి.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..!

Health Tips: ఈ రోజుల్లో అధిక కొలస్ట్రాల్‌ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మూడింట ఒక వంతు గుండె జబ్బులకు అధిక కొలెస్ట్రాలే కారణం. అయినప్పటికీ అన్ని కొలెస్ట్రాల్‌లు చెడ్డవి కావు. ఇందులో మంచి కొవ్వు కూడా ఉంటుంది. అధిక కొలస్ట్రాల్‌ రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. అయితే రోజువారీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలని చేర్చుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. అటువంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కాయధాన్యాలు, బ్రౌన్ రైస్

భారతీయ వంటకాల్లో పప్పు చాలా ముఖ్యమైనది. ఇది LDL కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ తృణధాన్యాలకి గొప్ప మూలంగా చెప్పవచ్చు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 20 శాతం వరకు తగ్గిస్తుంది.

పసుపు, నల్ల మిరియాలు

ఒక అధ్యయనం ప్రకారం 12 వారాల పాటు పసుపు, నల్ల మిరియాలు ఉన్న సప్లిమెంట్ తీసుకోవడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు తేలింది. ఈ రెండు మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.

బాదం, పెరుగు

బాదంలో ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను 4 శాతం వరకు తగ్గించవచ్చని కనుగొన్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయలు

వెల్లుల్లి, ఉల్లిపాయలను అన్ని కూరలలో ఉపయోగిస్తారు. రెండూ కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ ఉంటుంది ఇది LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News