blood vessels:: ఇవి తింటే రక్తనాళాలకు హానికరం
blood vessels: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా వీటిలో రక్తనాళాలు. రక్తనాళాలు సరిగా లేకపోతే గుండెపోటు వచ్చె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
blood vessels:: ఇవి తింటే రక్తనాళాలకు హానికరం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అంతర్గత అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా వీటిలో రక్తనాళాలు. రక్తనాళాలు సరిగా లేకపోతే గుండెపోటు వచ్చె ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం తినే కొన్ని ఆహారపదార్దాలు రక్తనాళాలకు హాని కలిగిస్తూ ఉంటాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్స్ పెరిగిపోతున్నాయంటున్నారు నిపుణులు.
తినే ఆహారాన్ని బట్టి రక్తనాళాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనకు తెలియకుండానే కొన్ని రకాల ఆహారపదార్దాలను అదేపనిగా తినేస్తూ ఉంటాము. ఈ ఆహారపదార్ధాలన్నీ కూడా రక్తాన్ని విరగొడతాయి. దీనివల్ల రక్తం చెడిపోతుంది. రక్తం చెడిపోతే రక్తనాళాలు చెడిపోతాయి. రక్తనాళాలు చెడిపోతే నెర్వ్స్ చెడిపోతాయి. ఆ తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఊహిచంలేం.
ఏ ఆహారపదార్ధాలు తినొద్దు?
వంకాయ, గోంగూర, నిల్వపచ్చళ్లు, చింతపండు.. ఈ నాలుగింటిని బాగా తగ్గించాలని లేదంటే రక్తనాళాలు తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో వ్యతిరేకగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పాడు చేస్తాయి. అంతేకాదు రక్తనాళాలకు సంబంధించిన మందులు వాడే సమయంలో కూడా వీటిని తినకూడదు. ఎందుకంటే ఆ మందులను పనిచేయనీయకుండా చేసే గుణం ఈ నాలుగు ఆహార పదార్ధాల్లో ఉంటుంది.
ఏం తినాలి?
రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం బలంగా ఉంటే సరిపోదు. ఆరోగ్యకరమైన డైట్‌ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్దాలను తినాలి.
పీచు పదార్దాలు
రక్తనాళాలు హెల్దీగా ఉండాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండాలి. ఎందుకంటే ధమనులు అనారోగ్యం పాలవ్వడానికి కొలెస్ట్రాలే ముఖ్య కారణం. అందుకే ప్యాకెట్ ఫుడ్‌ని బంద్ చేసి పీచు పదార్ధాలు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
ఆకుపచ్చ కూరలు
పచ్చని ఆకుకూరల్లో బయోప్లావనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఇవన్నీ రక్తనాళాలను బలపరుస్తాయి. అందుకే అన్ని రకాల ఆకుకూరలు తినాలి.
ఉప్పు తక్కువ, నీళ్లు ఎక్కువ
తినే ఆహారంలో ఉప్పును చాలా తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలో నీటిని అంతటినీ పీల్చేస్తుంది. దీనివల్ల నాళాలపై ప్రభావం పడుతుంది. అలాగే రక్తనాళాలు బలంగా ఉండాలంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లను కచ్చితంగా తాగాలి. దీని వల్ల శరీరం ఎక్కువగా పనిచేసే పని ఉండదు. అంతేకాదు శరీరంలోపల భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే బెస్ట్ మెడిసిన్ నీళ్లు.