Fat Cutter Drinks: కొవ్వు కరిగించడంలో ఈ పానీయాలు సూపర్.. ప్రతిరోజు పరగడుపున తాగండి..!

Fat Cutter Drinks: ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరగడం వల్ల చాలామందిలో కొవ్వు పేరుకుపోతుంది.

Update: 2024-04-08 15:00 GMT

Fat Cutter Drinks: కొవ్వు కరిగించడంలో ఈ పానీయాలు సూపర్.. ప్రతిరోజు పరగడుపున తాగండి..!

Fat Cutter Drinks: ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కూర్చొని పనిచేసే ఉద్యోగాలు పెరగడం వల్ల చాలామందిలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే అనారోగ్యకరమైన అలవాట్లు, వేళపాల లేని తిండి అలవాట్లు కూడా కొవ్వుకు కారణమవుతున్నాయి. దీనివల్ల శరీరం ఆకృతి దెబ్బతిని ఊబకాయులుగా మారిపోతున్నారు. తర్వాత దీనిని కరిగించడానికి ఉదయం, సాయంత్రం పరుగెత్తడం, జిమ్‌లో గంటల తరబడి చెమటలు కక్కించడం చేస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకుంటే కొవ్వు కరిగించడం అనేది ఒక క్రమపద్దతి ప్రకారం చేయాలి. అప్పుడే సరైన ఫలితాలు ఉంటాయి. ఇందుకోసం పరగడుపున కొన్ని పానీయాలు తాగాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1.గ్రీన్ టీ

పాలు, చక్కెర టీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ టీని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఫిట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. దీని రుచి చేదుగా ఉన్నప్పటికీ బరువు తగ్గడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2. నిమ్మకాయ నీరు

బరువు తగ్గడానికి లెమన్ వాటర్ చౌకైన ఎంపిక. ఇందుకోసం ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకుని అందులో బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు చాలా వరకు తగ్గుతారు.

3. సెలెరీ నీరు

సెలెరీ వంటగదిలో కనిపించే అద్భుతమైన మసాలా దినుసు. దీనిని క్యారమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం వడగట్టి తాగాలి.

4. సోంపు వాటర్

సోంపు తరచుగా భోజనం తర్వాత నములుతారు. ఎందుకంటే ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా సోంపును కలిపి రాత్రంతా నానబెట్టాలి. దీన్ని కాటన్ క్లాత్‌లో ఫిల్టర్ చేసి పరగడుపున తాగాలి.

Tags:    

Similar News