Health: కొలస్ట్రాల్‌ తగ్గించి రక్తనాళాలని శుభ్రపరిచే కూరగాయాలు ఇవే..!

Health: కొలస్ట్రాల్‌ తగ్గించి రక్తనాళాలని శుభ్రపరిచే కూరగాయాలు ఇవే..!

Update: 2022-03-13 14:30 GMT

Health: కొలస్ట్రాల్‌ తగ్గించి రక్తనాళాలని శుభ్రపరిచే కూరగాయాలు ఇవే..!

Health: చెడు కొలెస్ట్రాల్ కారణంగా ప్రజలు గుండెకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఇది రక్త నాళాలలో పేరుకుపోయి గుండెపోటుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్‌లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరొకటి చెడు కొలెస్ట్రాల్. బ్యాడ్‌ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఇది తరచుగా ఆహారం కారణంగా వస్తుంది. కాబట్టి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకునే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం. 

1. వెల్లుల్లి - వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగినంత స్థాయికి తీసుకువస్తాయి. మీరు కూరగాయలు, పప్పు, అన్నింటిలో వెల్లుల్లి వేయవచ్చు. వెల్లుల్లి తినడం గుండె, బీపీ రోగులకు చాలా మంచిది.

2. వంకాయ- బెండకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. 

3. క్యాబేజీ- క్యాబేజీలో చాలా ఫైబర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. క్యాబేజీలో లభించే ఫైబర్ రక్తంలో కొవ్వు, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. అందుకే కచ్చితంగా డైట్‌లో క్యాబేజిని చేర్చుకోవాలి.

4. బీన్స్- బీన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే బీన్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మొదలైన అంశాలు ఉంటాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది. బీన్స్ తినడం వల్ల రక్తనాళాలు బలపడతాయి. ఇది మాత్రమే కాదు బీన్స్ జీర్ణం కావడానికి సమయం పడుతుంది. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

5. బెండ- కొలెస్ట్రాల్ పెరిగిన వారు బెండకాయ తినాలి. ఇందులో జెల్ లాంటి మూలకాలు ఉంటాయి. ఇవి శరీరం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News