Heart: గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌ మధ్య వ్యత్యాసం ఉంటుందా.!

Heart: గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌ మధ్య వ్యత్యాసం ఉంది.. లక్షణాలలో తేడా తెలుస్తుంది

Update: 2021-12-20 06:31 GMT

Heart: గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌ మధ్య వ్యత్యాసం ఉంటుందా.!

Heart: ఆధునిక రోజుల్లో గుండె వ్యాధులు అన్ని రకాల వయసుల వారికి వస్తున్నాయి. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే గుండె వ్యాధులు వచ్చేవి అది కూడా యాబై ఏళ్లు దాటిన తర్వాత కానీ ఇప్పుడు ఇరవై ఏళ్ల యువకుడికి కూడా గుండె వ్యాధులు సంభవిస్తున్నాయి. గుండెకు సంబంధించి రెండు వ్యాధులను అందరు ఒకటే అనుకుంటారు. అవి వేరు వేరు. ఒకటి గుండెపోటు అయితే మరొకటి కార్డియాక్ అరెస్ట్‌. రెండింటి లక్షణాలు వేరుగా ఉంటాయి.

సాధారణంగా ప్రజలు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మధ్య తేడాను గుర్తించలేరు. గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదకరం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దీని కారణంగా వ్యక్తి శ్వాస తీసుకోలేడు. సకాలంలో చికిత్స అందించకపోతే వ్యక్తి మరణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

దీని నుంచి రక్షించడానికి వ్యక్తికి కార్డియోపల్మోనరీ రెసిస్టెన్స్ (CPR) ఇస్తారు. దీని ద్వారా హృదయ స్పందన సరిచేస్తారు. కార్డియాక్ అరెస్ట్ సంభవించే ముందు ఒక వ్యక్తి ఛాతీలో మంట, శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన ఛాతీ నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమయంలో పల్స్, రక్తపోటు పూర్తిగా ఆగిపోతాయి.

గుండెకు వచ్చే ధమనుల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే గుండెపోటు వస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడమే దీనికి ప్రధాన కారణం. కొలెస్ట్రాల్ కారణంగా గుండెలో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెపోటులో గుండెకు రక్త సరఫరా ఆగిపోతుంది కానీ కొట్టుకోవడం ఆగదు. అయితే కార్డియాక్ అరెస్ట్‌లో గుండె పని చేయడం ఆగిపోతుంది అందువల్ల గుండెపోటులో రోగిని రక్షించే అవకాశాలు కార్డియాక్ అరెస్ట్ కంటే చాలా ఎక్కువ. చాలా సందర్భాలలో గుండెపోటు స్వల్పంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రోగిని సులభంగా రక్షించవచ్చు. కానీ సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోతే గుండె ఆగి మరణించే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News