3 Whites Very Danger: మీ వంట గదిలో ఉన్న ఈ 3 తెల్లని పదార్ధాలను బయట పడేయండి

3 Whites Very Danger: ఈ మూడు తెల్లని పదార్ధాలు మీ వంట గదిలో ఉంటే వెంటనే వాటిని బయటకు పడేయండి. లేదంటే మీరు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ మూడింట వల్లే షుగర్, బీపీలు మన దేశంలో ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Update: 2025-06-13 15:00 GMT

3 Whites Very Danger: మీ వంట గదిలో ఉన్న ఈ 3 తెల్లని పదార్ధాలను బయట పడేయండి

3 Whites Very Danger: ఈ మూడు తెల్లని పదార్ధాలు మీ వంట గదిలో ఉంటే వెంటనే వాటిని బయటకు పడేయండి. లేదంటే మీరు ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ మూడింట వల్లే షుగర్, బీపీలు మన దేశంలో ఎక్కువవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు తెల్లని పదార్ధాలు ఏంటని ఆలోచిస్తున్నారా? పదండి మీకే తెలుస్తుంది.

ఉప్పు

తెల్లని ఉప్పు. శరీరంలోని బీపి పెంచుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరు ఉప్పును మానడం లేదు. కనీసం వంటల్లో తగ్గించడం లేదు. ఎందుకంటే వంటలకు రుచిని ఇచ్చేది ఈ ఉప్పు మాత్రమే కదా. అందుకే సరిపడా కాకుండా కాస్తంత ఎక్కువే తింటున్నారు. కానీ రోజుకి మన ఇండియన్స్ రకరకాల పదార్దాలు తినడం ద్వారా తినాల్సిన దాని కంటే రెట్టింపు తింటున్నారని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రోజులో ఉప్పు కేవలం 5 గ్రాముల కంటే తక్కువ తినాలని చెబుతోంది. అంటే ఒక టీ స్పూన్ సైజు అంత. అప్పుడే శరీరం ఆరోగ్యం ఉంటుందని చెబుతోంది. కానీ ఒక పావ్ బజీ తింటే మనకు మూడున్నర గ్రాముల ఉప్పు మన శరీరంలోకి వెళ్లిపోతుంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంత తినాలి? ఎంత ఉప్పు తినకూడదనేది మనకే తెలుస్తుంది. అయితే ఉప్పు స్థానంలో హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ లాంటివి తీసుకోవచ్చు. అవి కూడా చాలా తక్కువగా వాడితేనే మంచిది.

బియ్యం

తెల్లని బియ్యం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది. అందుకే చాలామంది లంచ్ టైంలో తిని, రాత్రిళ్లు తినకుండా ఉంటున్నారు. కానీ లంచ్ టైంలోనూ తెల్లని బియ్యంతో చేసిన అన్నంగానీ, దానితో చేసిన దోసులు, అట్లు లాంటివి తినడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. బియ్యం స్థానంలో మిలెట్స్, పప్పుధాన్యాలు, సిరెల్స్ తీసుకోవడం మంచిదంటున్నారు.

పంచదార

తెల్లని పంచదార లేనిదే టీ ఉండదు. మంచి స్వీట్ ఉండదు. అసలు పంచదార లేనిదే రోజు ఉండదు. కానీ ఈ తెల్లని పంచదారను వంట గది నుంచి దూరం చేసుకుంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనం తీసుకునే ఆహారంలో మొత్తం కేలరీలలో 10 శాతం కంటే తక్కువ పంచదార తినాలి. సీనియర్ సిటిజన్స్ పంచదారను అసలు తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ రోజుకు 50 గ్రాముల పంచదార తింటే షుగర్ రావడం పక్కా. అంటే దాదాపు 12 టీ స్పూన్లు. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ స్థానంలో బెల్లం, బ్రౌన్ షుగర్, తేనె వంటివి వాడొచ్చు అని చెబుతున్నారు.

Tags:    

Similar News