Tension Headache: టెన్షన్‌తో తలనొప్పి? ఈ జాగ్రత్తలతో తగ్గించవచ్చు!

Tension Headache: ఇప్పటి బిజీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళనలు, మానసిక అలసట వల్ల టెన్షన్ తలనొప్పి (Stress Headache) చాలా సాధారణ సమస్యగా మారింది.

Update: 2025-07-29 02:49 GMT

Tension Headache: టెన్షన్‌తో తలనొప్పి? ఈ జాగ్రత్తలతో తగ్గించవచ్చు!

Tension Headache: ఇప్పటి బిజీ జీవితంలో పని ఒత్తిడి, ఆందోళనలు, మానసిక అలసట వల్ల టెన్షన్ తలనొప్పి (Stress Headache) చాలా సాధారణ సమస్యగా మారింది. శరీరానికి శ్రమ పెడితే అది తట్టుకోగలదు కానీ, మెదడుపై ఒత్తిడి పెరగడం మాత్రం రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెన్షన్ వల్ల తలనొప్పి ఎందుకు వస్తుంది?

మానసిక ఒత్తిడితో మెదడులో హార్మోన్ల స్తరాలు మారిపోతాయి. ఫలితంగా నరాలు గట్టిగా ఉబ్బి, తలభాగంలో ఒత్తిడిగా మారుతాయి. ఇది నుదుటి, తల వెనుక భాగం లేదా తల మొత్తం బరువుగా అనిపించేలా చేస్తుంది. కొన్నిసార్లు ఇది అలసట వల్లనూ రావచ్చు.

ఈ తలనొప్పి ఎంతకాలం ఉంటుంది?

ఐదు నిమిషాల నుండి నాలుగు రోజుల వరకూ తలనొప్పి కొనసాగవచ్చు. దీనితీవ్రత, దానికితోడు ఎన్ని రోజులు ఉంటుందనేది వ్యక్తి స్ట్రెస్ లెవల్స్ మీద ఆధారపడి ఉంటుంది.

టెన్షన్ తలనొప్పి నివారణకు సూచనలు:

🔹 విశ్రాంతి తీసుకోవాలి: నొప్పి ఉన్నపుడు దైనందిన పనుల నుంచి బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వాలి.

🔹 డిజిటల్ డిటాక్స్: మొబైల్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించాలి.

🔹 వెలుతురు, శబ్దాల ప్రభావం తగ్గించండి: ఇంట్లో డిమ్ లైటింగ్ పెట్టాలి. పెద్ద శబ్దాల్ని దూరంగా ఉంచాలి.

🔹 ఆహార నియమాలు పాటించండి: గట్టిగా నమిలే ఆహారం తినకుండా, తేలికపాటి మరియు లిక్విడ్ డైట్‌ను అనుసరించాలి.

🔹 హైడ్రేషన్: నీళ్లు ఎక్కువగా తాగాలి.

🔹 కాఫీ, టీకు దూరంగా ఉండాలి.

ఇవి చేయకండి:

♦ పెయిన్ కిల్లర్స్‌ను డాక్టర్ సలహా లేకుండా తీసుకోవద్దు.

♦ నొప్పి ఉన్నపుడే జిమ్, హెవీ ఎక్సర్సైజ్ చేయకండి.

♦ సమస్యను నిర్లక్ష్యం చేయకండి – నొప్పి రెండు మూడు రోజులు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాల్సిందే.

Tags:    

Similar News