Teeth: పసుపు పచ్చ దంతాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ చిట్కాలతో తెల్లగా మార్చుకోండి..!

Teeth: పసుపు పచ్చ దంతాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ చిట్కాలతో తెల్లగా మార్చుకోండి..!

Update: 2022-06-15 01:30 GMT

Teeth: పసుపు పచ్చ దంతాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఈ చిట్కాలతో తెల్లగా మార్చుకోండి..!

Teeth: ఆధునిక జీవన శైలిలో చాలామందికి పళ్లు తోముకోవడానికి కూడా సమయం ఉండటంలేదు. దీంతో దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయి. దీంతో చాలా మంది నోరు తెరవడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలని పాటించి పళ్లని తెల్లగా మార్చుకోవచ్చు. కిచెన్‌లోని మూడు వస్తువులని ఉపయోగించి పళ్లని ఎలా తెల్లగా చేసుకోవాలో తెలుసుకుందాం.

1. రోజూ బ్రష్ చేయండి. కొంతమందికి బ్రష్ చేయకుండానే టీ బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు మీకు దంతక్షయం ఏర్పడుతుంది. కాబట్టి మీరు నిద్రలేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి. దీంతో మీ దంతాలు పసుపు రంగులోకి మారవు.

2. లవంగం పొడితో పసుపు పళ్ళు తెల్లగా మారుతాయి. దీని కోసం మీరు ఆలివ్ నూనెలో లవంగాల పొడిని మిక్స్ చేసి పసుపు పళ్ళపై అప్లై చేయాలి. ఇది నోటి దుర్వాసనను, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

3. నిమ్మరసంలో ఆవాలనూనె, ఉప్పు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీంతో బ్రష్ చేయడం ద్వారా మీ పసుపు దంతాలు తెల్లబడటం ప్రారంభమవుతాయి.

4. పసుపు పళ్లను తెల్లగా మార్చడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. దీంతో నెమ్మదిగా బ్రష్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల దంతాలు పసుపు త్వరగా తొలగిపోయి అందంగా మెరిసిపోతాయి.

Tags:    

Similar News