Teeth Care: ఆరోగ్యమైన దంతాలు కావాలంటే ఈ పదార్ధాలు తినండి
Teeth care: పళ్లను బట్టి మనిషి ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేయొచ్చు. డాక్టర్లు కూడా అదే చెబుతారు. ఎవరికైనా పళ్లన్నీ పుచ్చుపోయి ఉంటే ఆ మనిసి శరీరంలో చాలా భాగాలు సరిగా పనిచేయడం లేదని అర్ధం.
Teeth Care: ఆరోగ్యమైన దంతాలు కావాలంటే ఈ పదార్ధాలు తినండి
Teeth care: పళ్లను బట్టి మనిషి ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పేయొచ్చు. డాక్టర్లు కూడా అదే చెబుతారు. ఎవరికైనా పళ్లన్నీ పుచ్చుపోయి ఉంటే ఆ మనిసి శరీరంలో చాలా భాగాలు సరిగా పనిచేయడం లేదని అర్ధం. అదే పళ్లు ఆరోగ్యంగా కనిపిస్తే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉందని అర్ధం. మరి ఈ పళ్లని మీరెంత ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారు? మీరు వాటికోసం ఎంత కేర్ తీసుకుంటున్నారు? అంటే కొన్ని రకాల ఆహారపదార్ధాలు తింటే మీ పళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పళ్లకోసం తీసుకునే జాగ్రత్తలు అంటే ఉదయం, రాత్రి సమయాల్లో బ్రష్ చేయాలి. వేడివి, చల్లవి తినకూడదు. తాగకూడదు. ఇవి చాలామంది చేసేవే అయినా కొందరి పళ్లు ఆరోగ్యంగా ఉండవు. అంటే దీనికి కారణం మీరు సరైన ఆహారం తినడం లేదని అర్ధం. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తింటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పాలు
పళ్లు గట్టిగా ఉండాలంటే కాల్షియం ఉండే ఆహారపదార్ధాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. అందుకే డైలీ పాలు, పాలతో చేసిన పదార్ధాలను తినాలి.
చీజ్
చీజ్‌లో కాల్షియం అలాగే కాసైన్ అనే ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలపై వచ్చే పసుపు రంగును కూడా తగ్గిస్తుంది.
ఆపిల్
యాపిల్ ఎక్కువగా తినడం నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది కావిటీలకు దారితీసే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోటిని శుభ్రం చేయడంలోనూ సహాయపడుతుంది.
క్యారెట్
ప్రతిరోజూ క్యారెట్ తింటే పళ్లు బలంగా ఉంటాయి. అదేవిధంగా పళ్లు విరిగిపోవడం, పగిలిపోవడం వంటివి జరగకుండా క్యారెట్ సహాయపడుతుంది.
కిస్ మిస్‌లు
కిస్ మిస్‌లలో ఉండే ఫైటో కెమికల్స్ పళ్లపై ఏర్పడే కావిటీలను తగ్గిస్తుంది. అదేవిధంగా చిగుళ్ల వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
పుల్లని పదార్ధాలు
నిమ్మకాయ, నారింజ, మామిడి వంటి పుల్లని పండ్లను తంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. దీనివల్ల పళ్ల కింద ఉండే రక్తనాళాలు బలంగా ఉంటాయి. పళ్ల నుంచి రక్తం రావడం తగ్గుతుంది.
సాల్మన్ చేపలు
విటమిన్ డి అధికంగా సాల్మన్ చేపలు తింటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు దంతాలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే మీరు సాల్మన్ చేపలను క్రమం తప్పకుండా తినాలి.