Diabetes: డయాబెటీస్‌కి ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసా..!

Diabetes: మన దేశంలో చాలా మంది డయాబెటీస్ టెస్ట్‌ చేయించుకోకపోవడం వల్ల చాలామందిలో ఇది బయటపడటం లేదు.

Update: 2022-02-27 11:12 GMT

Diabetes: డయాబెటీస్‌కి ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసా..!

Diabetes: మన దేశంలో చాలా మంది డయాబెటీస్ టెస్ట్‌ చేయించుకోకపోవడం వల్ల చాలామందిలో ఇది బయటపడటం లేదు. డయాబెటీస్‌కి ముందు కొన్ని ప్రాథమిక లక్షణాలు ఖచ్చితంగా మన శరీరంలో కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు తినే ఆహారం, అలవాట్లపై శ్రద్ద చూపకుంటే టైప్-2 డయాబెటీస్ బారిన పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రీ డయాబెటిస్ లేదా బోర్డర్‌లైన్ డయాబెటిస్ అనేది ఒక వ్యక్తి టైప్ 2 డయాబెటిస్‌కి గురయ్యే ముందు కనిపించే పరిస్థితి. వైద్యుల నివేదికల ప్రకారం ప్రీ డయాబెటిస్ రోగి రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని డయాబెటిస్‌గా పరిగణించకూడదు. చర్మంపై నల్లటి మచ్చలు లేదా చర్మం నల్లబడటం ప్రీ-డయాబెటిస్ లక్షణంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మోచేతులు, మోకాలు, పిడికిలి, మెడ, చంకలు వంటి ప్రాంతాల్లో టోన్ డార్కింగ్ లేదా డార్క్ ప్యాచ్‌లు ఏర్పడటం ప్రారంభమవుతుంది.

ఇది కాకుండా అలసట ఎక్కువగా ఉంటుంది. రాత్రి బాగా నిద్రపోయిన తర్వాత కూడా మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ లక్షణాలు ప్రీ-డయాబెటిస్‌లో ఉండవచ్చని అర్థం చేసుకోండి. పదే పదే దాహంగా అనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇది కాకుండా తరచుగా మూత్రవిసర్జన చేయడం కూడా ప్రీ-డయాబెటిస్ లక్షణమని చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే నిర్ధారణ అయితే ప్రారంభంలో కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యాధి ముదరకుండా ఆపవచ్చు. 

Tags:    

Similar News