Sweet : భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే ఈ సారి ఈ స్వీట్ ట్రై చేయండి
Sweet: చాలామందికి భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. దీంతో పంచదారతో చూసిన రకరకాల స్వీట్లను తినేస్తుంటారు. అయితే ఇలా భోజనం తిన్న వెంటనే సుగర్‌తో చేసిన స్వీట్ తింటే ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంది.
Sweet : భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుందా? అయితే ఈ సారి ఈ స్వీట్ ట్రై చేయండి
Sweet: చాలామందికి భోజనం చేసిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. దీంతో పంచదారతో చూసిన రకరకాల స్వీట్లను తినేస్తుంటారు. అయితే ఇలా భోజనం తిన్న వెంటనే సుగర్‌తో చేసిన స్వీట్ తింటే ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు కొన్ని సార్లు గుండె సబంధిత వ్యాధులకూ ఇది కారణం అవుతుంది. అందుకే ఈ స్వీట్ తింటే మీరు ఆరోగ్యం బాగుండడంతో పాటు మీరు స్వీట్ తినారన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది.
స్వీట్లలో చాలా రకాలు ఉంటాయి. కానీ ఏది ఆరోగ్యమైనది అనేదే ముఖ్యం. ఎందుకంటే పంచదారతో చేసిన స్వీట్లను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చెడు జరుగుతుంది. అందుకే వాటి స్థానంలో రకరకాల హెల్దీ స్వీట్లు చేసుకోవాలి. అందులో ఒకటి రాగి, మినపప్పు, నువ్వులు లడ్డు.
ఈ లడ్డుని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒక పది నిమిషాల్లో స్వీట్ తయారైపోతుంది. పైగా అద్బుతమైన పోషకాలు వీటిలో ఉంటాయి. కాబట్టి ఈ స్వీట్ తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గడమే కాకుండా హెల్దీగా ఉంటారు.
రాగి, మినపప్పు, నువ్వుల లడ్డు తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు మినపప్పు వేసి దోరగా వేయించాలి. ఇది సగం వేగిన తర్వాత ఒక కప్పు రాగులు వేయాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక అరకప్పు నువ్వులు వేయాలి. ఇలా మూడింటినీ దోరగా వేయించిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మీకు కావాలనుకుంటే ఒక రెండు యాలకులు వేసుకుని పొడి చేసుకోవచ్చు.
కళాయిలో ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. దీని ఐదు నిమిషాల పాటు మరిగించాలి. బెల్లం పూర్తి పాకం రానక్కరలేదు. లైట్‌గా వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుని రెడీ గా ఉంచుకున్న పిండిని ఈ పాకంలో వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇలా మిశ్రమం అంతా కలిసిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. ఈ సమయంలో కాస్త నెయ్యి, కాస్త యాలకుడి పొడి( ముందు మిక్సీ జార్‌లో వేయకపోతే)మరికొంచెం సేపు ఉడికించాలి. పిండి ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసి చల్లార్చాలి. ఆ తర్వాత నెమ్మదిగా దాన్ని ఉండలుగా చుట్టాలి. లేదంటే ఉండలుగా చుట్టకుండా ఒక గిన్నెలో వేసుకుని కూడా తీనేయొచ్చు. ఈ లడ్డు పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా ఎంతోమంచిది.