Sweet Corn: కొంతమందికి స్వీట్ కార్న్ ప్రమాదమే... ఎవరు దూరంగా ఉండాలో తెలుసా?
Sweet Corn: వర్షాకాలంలో వేడి వేడి స్వీట్ కార్న్‌ను తినే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతోమంది దీన్ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. పిజ్జా, పరోటా, సమోసా వంటి ఫుడ్స్‌లో కూడా స్వీట్ కార్న్ వాడకం అధికమవుతోంది.
Sweet Corn: కొంతమందికి స్వీట్ కార్న్ ప్రమాదమే... ఎవరు దూరంగా ఉండాలో తెలుసా?
Sweet Corn: వర్షాకాలంలో వేడి వేడి స్వీట్ కార్న్‌ను తినే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎంతోమంది దీన్ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. పిజ్జా, పరోటా, సమోసా వంటి ఫుడ్స్‌లో కూడా స్వీట్ కార్న్ వాడకం అధికమవుతోంది. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం దీన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వీట్ కార్న్‌లో ఆరోగ్య ప్రయోజనాలేంటి?
స్వీట్ కార్న్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. అయితే... అన్ని మంచుల వెనుక కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇవాళ్లు మాత్రం స్వీట్ కార్న్‌కు దూరంగా ఉండాలి
♦ జీర్ణ సమస్యలతో బాధపడేవారు:
జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉండే వారికి అధిక ఫైబర్ ఉండే స్వీట్ కార్న్ మేలు చేయదు. ఇది అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
♦ గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు:
స్వీట్ కార్న్‌లో గ్లూటెన్ తక్కువ స్థాయిలో ఉన్నా, అలెర్జీతో బాధపడే వారు దీన్ని పూర్తిగా నివారించాలంటున్నారు నిపుణులు. మొక్కజొన్న తిన్న వెంటనే నీరు తాగడం కూడా నివారించాలి, అది జీవక్రియను మందగించవచ్చు.
♦ పెల్లాగ్రా వ్యాధికి అవకాశముంది:
స్వీట్ కార్న్ ఎక్కువగా తినడం వల్ల ఇతర పోషకాలలో లోపం ఏర్పడి విటమిన్ బి3 కొరతతో వచ్చే ‘పెల్లాగ్రా’ వ్యాధికి కారణమవవచ్చు.
♦ డయాబెటిస్ రోగులు జాగ్రత్త:
స్వీట్ కార్న్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉండటంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచే ప్రమాదం ఉంది. మధుమేహంతో బాధపడేవారు వైద్య సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
ఇతరులు కూడా అప్రమత్తంగా ఉండాలి
♦ చర్మవ్యాధులతో బాధపడేవారు: మొక్కజొన్నలోని ప్రోటీన్లు చర్మ అలెర్జీలు, దద్దుర్లకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
♦ బరువు తగ్గాలని చూస్తున్నవారు: స్వీట్ కార్న్‌లో ఉండే పిండి పదార్థాలు, చక్కెరలు బరువు పెరుగుదలకు దోహదపడతాయి.
♦ దంత సమస్యలతో బాధపడేవారు: కార్న్ తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేయకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశముంది.
గమనిక: స్వీట్ కార్న్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో ఇది అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి స్వీట్ కార్న్‌ను తినాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.