Beauty Tips: సన్ స్క్రీన్ లోషన్ ముఖానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా?

Beauty Tips: ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణం వేడి సెగలతో రగిలిపోతుంది.

Update: 2025-07-14 10:54 GMT

Beauty Tips: సన్ స్క్రీన్ లోషన్ ముఖానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా?

Beauty Tips: ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. వర్షాకాలం, చలికాలంలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణం వేడి సెగలతో రగిలిపోతుంది. అయితే ఈ ఎండల నుండి కాపాడుకోడానికి చాలామంది సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతుంటారు. అసలు ఈ సన్ స్క్రీన్ ముఖానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? ఇప్పుడు చూద్దాం.

చాలామంది ఉదయం లేవగానే సన్ స్క్రీన్ రాస్తుంటారు. లేదంటే బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాస్తుంటారు. ఎవరు సన్ స్క్రీన్ రాసినా దానికి కారణం ఎండలో ముఖం నల్లగా మారకుండా ఉండడానికే. అయితే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల కొందరికి మంచి జరుగుతుంది. మరికొందరకి చెడు జరుగుతుంది. దీనికి కారణాలు ఇవే..

సన్ స్క్రీన్‌తో లాభాలు

సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర ఈ సన్ స్క్రీన్ చేస్తుంది. అందుకే ప్రతిరోజూ బయటకు వెళ్లేవాళ్లు.. అలాగే ఇంట్లో ఉండేవాళ్లు కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని ముఖానికి అప్లై చేయాలని అంటుంటారు నిపుణులు. లేకపోతే ఎండలో వెళ్లిన ప్రతిసారి సూర్యకిరణాలు నేరుగా చర్మంపై పడితే.. చర్మం ట్యాన్ కావడం, నల్లగా మారడం, పింపుల్స్ రావడం, నల్లని మచ్చలు రావడం వంటివి వస్తాయి. ఈ సన్ స్క్రీన్ అనేది వాటినన్నింటినీ దూరం చేస్తుంది. అంతేకాదు సన్ స్క్రీన్ లోషన్‌తో ముడతలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా కాపాడుంది. చర్మ క్యాన్సర్, వడ దెబ్బ వంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు సన్ స్క్రీన్ లోషన్ అనేది ముఖానికి రాయాలి.

సన్ స్క్రీన్‌తో నష్టాలు

మంచి సన్ స్క్రీన్ లోషన్స్ వాడకపోతే చర్మం పాడయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల చర్మ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మంచి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. అంతేకాదు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడానికి ఒక సరైన సమయం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే 20 నిమిషాల ముందు దీన్ని అప్లై చేయాలి. అప్పుడు అది చర్మంలో కలిసిపోతుంది. లేదంటే వెంటనే ఎండలోకి వెళ్లితే చర్మంపై రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చర్మ సమస్యలు ఉన్నవాళ్లు, అలర్జీలు ఉన్నవాళ్లు సన్ స్క్రీన్ కు దూరంగా ఉండాలి. వైద్యుల సహకారంతో వీటిని వాడాలి.

Tags:    

Similar News