Sugar Levels: శరీరంలో షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా ఎందుకు పడిపోతాయి? ఎంత ప్రమాదమో తెలుసా?
Sugar Level Suddenly Decrease: మన శరీరానికి ప్రధాన శక్తి వనరైన చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గితే అది ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
Sugar Levels: శరీరంలో షుగర్ స్థాయిలు అకస్మాత్తుగా ఎందుకు పడిపోతాయి? ఎంత ప్రమాదమో తెలుసా?
Sugar Level Suddenly Decrease: మన శరీరానికి ప్రధాన శక్తి వనరైన చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గితే అది ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. ప్రత్యేకంగా డయాబెటిస్ రోగుల్లో ఇది తరచుగా కనిపిస్తుంది. అయితే డయాబెటిస్ లేని వ్యక్తుల్లో కూడా రక్తంలో చక్కెర పడిపోవడం సంభవించవచ్చు. దీంతో మెదడు కార్యకలాపాలు, శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
హైపోగ్లైసీమియా అంటే ఏమిటి?
సాధారణంగా రక్తంలో చక్కెర 80 mg/dL లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
రక్తంలో చక్కెర 70 mg/dL కంటే తక్కువగా పడిపోయినప్పుడు శరీరం అలర్ట్ సంకేతాలు ఇస్తుంది.
చక్కెర తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు:
♦ చలి వేయడం
♦ చెమటలు పట్టడం
♦ చేతులు, కాళ్లు వణుకుట
♦ గుండె వేగంగా కొట్టుకోవడం
♦ బలహీనంగా అనిపించడం
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే రక్తంలో చక్కెరను తనిఖీ చేసి వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ లెవల్స్ పడిపోవడానికి కారణాలు
రక్తంలో చక్కెర 55 mg/dL కంటే తక్కువగా ఉండటం తీవ్రమైన స్థితి. ఈ సమయంలో వ్యక్తికి మాట్లాడటం, ఆలోచించడం, నడవడం కూడా కష్టమవుతుంది. కారణాలు అయితే ఇవి:
♦ తక్కువగా తినడం లేదా భోజనం మిస్ అవడం
♦ అధిక శారీరక శ్రమ
♦ ఇన్సులిన్ లేదా ఇతర షుగర్ మందులు అధిక మోతాదులో తీసుకోవడం
♦ తీవ్రమైన అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్లు
♦ భోజనంలో సమతుల్య కార్బోహైడ్రేట్స్ లేకపోవడం
వెంటనే చికిత్స అందించకపోతే ఇది ప్రాణాంతకమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చక్కెర తగ్గినప్పుడు ఏం చేయాలి?
రోగి స్పృహలో ఉంటే:
20–30 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఇవ్వాలి —
జ్యూస్, పండ్లు, చక్కెర నీళ్లు లేదా గ్లూకోజ్ మాత్రలు.
రోగి స్పృహలో లేకపోతే:
ఎప్పుడూ ఆహారం నోటి ద్వారా ఇవ్వకండి.
అదే బదులుగా గ్లూకాగాన్ ఇంజెక్షన్ ఇవ్వాలి.
అరగంట తర్వాత చక్కెరను మళ్లీ చెక్ చేయాలి.
మెరుగుదల లేకుంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
ఏం తింటే హైపోగ్లైసీమియా నియంత్రణలో ఉంటుంది?
నిపుణులు సూచించే ఆరోగ్యకర ఆహారం:
♦ ఆకుకూరలు
♦ బ్రౌన్ రైస్
♦ ఓట్స్, క్వినోవా
♦ చికెన్, చేపలు
♦ కాయధాన్యాలు, గింజలు
♦ తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు
♦ ఆరోగ్యకరమైన కొవ్వులు
మానుకోవాల్సినవి:
శుద్ధి చేసిన చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తెల్ల బ్రెడ్, స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్.
సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా షుగర్ పర్యవేక్షణ, డాక్టర్ సూచించిన మందులను సరిగ్గా వాడడం ద్వారా హైపోగ్లైసీమియాను నియంత్రించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.)