Garlic: వెల్లుల్లి పొట్టు తీసి ఫ్రిజ్ లో పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

Garlic: వెల్లుల్లి ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే ఓ నిత్యావసరం. ప్రతి రోజు ఉపయోగిస్తాం కాబట్టి దానిని సరిగ్గా నిల్వ చేయడం కూడా ముఖ్యమే.

Update: 2025-02-20 07:45 GMT

Garlic: వెల్లుల్లి పొట్టు తీసి ఫ్రిజ్ లో పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

Garlic: వెల్లుల్లి ప్రతి ఇంటి వంటగదిలో ఉపయోగించే ఓ నిత్యావసరం. ప్రతి రోజు ఉపయోగిస్తాం కాబట్టి దానిని సరిగ్గా నిల్వ చేయడం కూడా ముఖ్యమే. సమయం ఆదా చేయడానికి చాలా మంది వెల్లుల్లిని ముందుగానే పొట్టు తీసి ఫ్రిజ్ లో పెట్టుకుంటారు. కానీ ఈ పద్ధతి సరైనది కాదని కొందరు చెబుతున్నారు. తొక్క తీసిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల కలిగే నష్టల గురించి ప్రముక డైటీషన్ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

వెల్లుల్లికి సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కానీ దానిని తొక్క తీసి ఉంచినప్పుడు అది త్వరగా చెడిపోతుంది. దానిలో ఫంగస్ లేదా బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది. దానిని సరిగ్గా నిల్వ చేయకపోతే తేమగా మారిపోతుంది. అందువల్ల త్వరగా కుళ్లిపోతుంది.

ఫ్రీజ్ లో నిల్వ చేయడం వల్ల కలిగే నష్టాలు

* రుచి, వాసన తగ్గుతుంది: వెల్లుల్లి అసలు రుచి, దాని ఘాటు వాసన క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

* బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది: కోసిన లేదా తొక్క తీసిన వెల్లుల్లిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ప్రత్యేకించి దానిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయకపోతే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది.

* తేమ దానిని త్వరగా చెడిపోయేలా చేస్తుంది: రిఫ్రిజిరేటర్‌లో అధిక తేమ ఉంటుంది. అందువల్ల వెల్లుల్లి మృదువుగా మారి చెడిపోతుంది. దానిలో ఆకుపచ్చ లేదా నల్లటి ఫంగస్ అభివృద్ధి చెందుతుంది.

* ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం: తొక్క తీసిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు ఉంచితే క్లోస్ట్రిడియం బోటులినమ్ వంటి బ్యాక్టీరియా అందులో పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది.

నిల్వకు సరైన మార్గం ఏంటి?

తొక్క తీసిన వెల్లుల్లిని నిల్వ చేయాలనుకుంటే, కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి

* గాలి చొరబడని కంటైనర్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయండి. ఇది గాలి మరియు తేమను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.దాని షెల్ఫ్ లైఫ్ 7 నుండి 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో మీరు దానిని ఉపయోగించాలి.

* తొక్క తీసిన వెల్లుల్లిని ఆలివ్ నూనెలో లేదా ఏదైనా వంట నూనెలో ముంచి నిల్వ చేయడం మంచి మార్గం. ఇది దాని రుచిని చెక్కుచెదరకుండా ఉంచడమే కాకుండా ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది.

* మీరు దీన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే దానిని పేస్ట్‌గా తయారు చేసి ఫ్రీజర్‌లో ఉంచండి.

Tags:    

Similar News