Beauty Tips: బేబీ క్రీమ్‌ని మాయిశ్చరైజర్‌గా వాడుతున్నారా? ఇక మీ పని గోవిందా!

డెర్మటాలజిస్టుల ప్రకారం, పెద్దల చర్మం తేమను త్వరగా కోల్పోతుంది. ఈ కారణంగా, దీని సంరక్షణకు హైలూరోనిక్ యాసిడ్, సెరమైడ్స్, పెప్‌టైడ్స్ వంటి పదార్థాలతో తయారు చేసిన మాయిశ్చరైజర్లు అవసరం.

Update: 2025-03-19 08:28 GMT

Beauty Tips: బేబీ క్రీమ్‌ని మాయిశ్చరైజర్‌గా వాడుతున్నారా? ఇక మీ పని గోవిందా!

Beauty Tips: చర్మ సంరక్షణలో కొత్త ఉత్పత్తులు రోజుకో రూపంలో మార్కెట్‌లోకి వస్తున్నప్పటికీ, ఇప్పటికీ కొంతమంది చిన్నతనంలో వాడే బేబీ క్రీమ్‌లను మాయిశ్చరైజర్‌గా కొనసాగిస్తున్నారు. అయితే, శిశువుల చర్మానికి తయారు చేసిన ఈ క్రీమ్‌లు పెద్దల చర్మానికి సరిపోవు. బేబీ చర్మం చాలా మృదువుగా, తక్కువ నూనెతో ఉండటానికి అనుకూలంగా ఉండేలా రూపొందించిన క్రీమ్‌లు, పెద్దల కోసం తగినంత హైడ్రేషన్, రక్షణ ఇవ్వలేవు. రోజూ కాలుష్యం, యూవీ రేస్‌, ఒత్తిడి లాంటి అంశాలకు గురయ్యే పెద్దల చర్మం ప్రత్యేకమైన పోషణ అవసరం.

డెర్మటాలజిస్టుల ప్రకారం, బేబీ క్రీమ్‌ల్లో హైలూరోనిక్ యాసిడ్, సెరమైడ్స్, SPF వంటి ముఖ్యమైన పదార్థాలు ఉండవు, ఇవి తేమను నిల్వచేయడం, కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, ముడతలను నియంత్రించడం వంటి పనులను చేయలేవు. అదే విధంగా, బేబీ షాంపూలు, సబ్బులు, లోషన్లు కూడా పెద్దల కోసం పూర్తిగా సమర్థవంతంగా ఉండవు. బేబీ షాంపూలు తలపై మురికి, నూనెను పూర్తిగా తొలగించలేవు, బేబీ సబ్బులు లోతుగా శుభ్రపరచలేవు, బేబీ లోషన్లు పెద్దల చర్మానికి అవసరమైన తేమను అందించలేవు.

పెద్దల చర్మానికి సరైన సంరక్షణ అందించాలంటే, చర్మ రకానికి అనుగుణంగా ప్రత్యేకమైన మాయిశ్చరైజర్‌ను ఎంపిక చేయడం అవసరం. పొడి చర్మం ఉంటే షియా బట్టర్, సెరమైడ్స్ కలిగిన ఉత్పత్తులను, జిడ్డు చర్మం ఉంటే నాన్-కోమెడోజెనిక్ గెల్ మాయిశ్చరైజర్ వాడాలి. వయస్సు పెరిగే కొద్దీ హైలూరోనిక్ యాసిడ్, విటమిన్ సి, రెటినాల్ వంటి పదార్థాలు ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. అలాగే, SPF 50 ఉన్న మాయిశ్చరైజర్‌ను రోజూ వాడటం అనివార్యం. మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, చిన్నతనం నుంచి వాడుతున్న బేబీ ఉత్పత్తులను వదిలి, పెద్దల చర్మానికి తగిన సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News