పాలకూర జ్యూస్‌ ఈ వ్యాధులకు దివ్య ఔషధం.. ప్రయోజనాలు తెలుసుకోండి..

Spinach Juice: పాలకూర ఆకుకూరలలో నెంబర్ వన్. ఇది శరీరానికి చాలా మంచిది.

Update: 2021-12-01 03:30 GMT

పాలకూర జ్యూస్ (ఫైల్ ఇమేజ్)

Spinach Juice: పాలకూర ఆకుకూరలలో నెంబర్ వన్. ఇది శరీరానికి చాలా మంచిది. పాలకూరను సలాడ్ లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్‌తో పాటు కెరోటిన్, అమైనో ఆమ్లాలు, ఐరన్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకే ప్రతిరోజు పాలకూర జ్యూస్‌ తాగితే ఆరోగ్యానికి ఈ పోషకాలు అన్నీ అందుతాయి.

పాలకూర రసం ఎలా తయారు చేయాలి?

పాలకూర రసం చేయడానికి 2 కప్పుల పాలకూరని కడిగి శుభ్రం చేసి కట్‌ చేయాలి. 1 ఆపిల్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. గ్రైండర్‌లో కొన్ని నీరు పోసి యాపిల్ ముక్కలు, పాలకూరని వేసి మక్పి పట్టండి. తర్వాత ఈ జ్యూస్‌కి నిమ్మకాయ రసం కలపండి. పండ్ల ముక్కలు మిగిలి ఉండకుండా చూసుకోండి. మిశ్రమం తర్వాత రసం వడకట్టండి. తాజా పాలకూర రసం సిద్ధంగా ఉంది. ఒక గ్లాసు పాలకూర రసం మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఎముకలను బలపరుస్తుంది

పాలకూరలో ఉండే విటమిన్ K ఎముకలలో కాల్షియంను పెంచుతుంది. ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా పాలకూరలో విటమిన్ డి, కాల్షియం, డైటరీ ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి.

కళ్ళ కోసం

పాలకూరలో క్లోరోఫిల్, బీటా-కెరోటిన్, మాక్యులా, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మాక్యులా అనేది రెటీనాలో ఒక భాగం. ఇది సహజమైన సన్‌బ్లాక్, హానికరమైన కాంతి నుంచి కళ్ళను రక్షిస్తుంది. మీ శరీరంలోని ఈ పోషకాలను తిరిగి నింపడంలో పాలకూర జ్యూస్ మీకు సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

పాలకూరలో ఉండే విటమిన్ సి ముడతలను నివారిస్తుంది. కంటి వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బుల నుంచి మనలను రక్షిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Tags:    

Similar News