Bathroom: బాత్రూమ్‌లో 7 నిమిషాల కంటే ఎక్కువ ఉంటున్నారా? ఈ ముప్పు తప్పదంటున్న అధ్యయనాలు..!

Spendig in Bathroom Overtime: బాత్రూంలో 7 నిమిషాలకు మించి సమయం గడుపుతున్నారా? అయితే ఈ తీవ్ర ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న అధ్యయనాలు.

Update: 2025-04-19 08:15 GMT

Bathroom: బాత్రూమ్‌లో 7 నిమిషాల కంటే ఎక్కువ ఉంటున్నారా? ఈ ముప్పు తప్పదంటున్న అధ్యయనాలు..!

Bathroom: ఈ బిజీ లైఫ్ స్టైల్ లో కొన్ని మనం చేసే హడావిడి పనులు మనకి గుర్తుండవు. అయితే ఉదయాన్నే మీరు టాయిలెట్ వెళ్లినప్పుడు కూడా ఎంత సమయం గడుపుతున్నారు అనేది మాత్రం కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ సమయం పాటు టాలెంట్లలో గడిపిన వారికి తీవ్ర ప్రమాదాలు తప్పని కొన్ని అధ్యాయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా కమోడ్ పై కూర్చొని ఎక్కువ సేపు చాట్ చేయడం ఫోన్ వీక్షించడం చేస్తూ వాష్ రూమ్ లో ఎక్కువ సమయం పాటు గడుపుతున్నారు.

స్మార్ట్ ఫోన్ పట్టుకొని పది నిమిషాలకు పైన కూర్చున్న వారికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఒక టర్కీ జర్నల్ తెలిపింది. ఇక బాత్రూం కమోడ్‌పై ఎక్కువ సమయం పాటు కూర్చోవడం వల్ల పురుష నాళం వద్ద ఒత్తిడి పెరిగే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు.

అంతేకాదు మలబద్ధక సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో టాయిలెట్ కి తరచూ వెళ్తారు లేకపోతే మలబద్దక సమస్య కూడా ఏర్పడుతుంది. కొన్నిసార్లు బలవంతంగా మలవిసర్జన చేయాల్సి పరిస్థితి వచ్చి ఇలానే సాగితే ఫిషర్స్ కూడా వస్తుంది.

చాలామంది బిజీగా ఉండటం వల్ల బాత్రూంలో కూడా ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. ఇది నెగటివ్ ప్రభావం కూడా సైకలాజికల్ గా పడుతుంది. తద్వారా యూటీఐ సమస్యలు వస్తాయి. నడుము నొప్పి కూడా వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఫోన్ స్క్రీన్ పై కూడా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందుకే బ్యాక్టిరియా బారిన పడకుండా ఫోన్ బాత్రూమ్‌లోకి తీసుకు వెళ్ళకండి. అక్కడ ఏడు నిమిషాల కంటే ఎక్కువ సమయం కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకోండి.

Tags:    

Similar News