Sore Throat: సీజన్‌ మారిందంటే గొంతునొప్పి వచ్చేస్తుంది.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఉపశమనం..!

Sore Throat: సీజన్‌ మారిందంటే చాలు కొంతమందికి గొంతునొప్పి వేధిస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Update: 2023-06-27 15:00 GMT

Sore Throat: సీజన్‌ మారిందంటే గొంతునొప్పి వచ్చేస్తుంది.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఉపశమనం..!

Sore Throat: సీజన్‌ మారిందంటే చాలు కొంతమందికి గొంతునొప్పి వేధిస్తుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరు ఎండాకాలం అలవాట్లని మానుకోలేక ఇంకా చల్లటి నీరు, కూల్‌డ్రింక్స్‌, లస్సీ వంటివి తాగుతుంటారు. దీని కారణంగా గొంతు నొప్పి ఏర్పడుతుంది. దీంతో మాట్లాడటం, ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి సమయంలో అమ్మమ్మ కాలంనాటి ఆయుర్వేద చిట్కాలని పాటించి గొంతునొప్పిని వదిలించుకోవచ్చ. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

మెంతులు

మెంతులు ఒక సుగంధ ద్రవ్యం. అందుకే దీనిని వంటకాల తయారీలో ఎక్కువగా వాడుతారు. ఒక కప్పు నీటిలో ఒక చెంచా మెంతులు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఫిల్టర్ చేసి తాగాలి. దీనివల్ల ఉపశమనం లభిస్తుంది.

ఉసిరి, తేనె మిశ్రమం

ఉసిరి, తేనె మిశ్రమం గొంతు నొప్పికి దివ్యౌషధంగా చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటే ఒక చెంచా ఉసిరి పొడిని తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి పుక్కిలిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఉప్పు, పసుపు నీరు

ఆహారం రుచిని పెంచడానికి ఉప్పు, పసుపును ఉపయోగిస్తారు. ఈ రెండింటి కలయిక గొంతు నొప్పి నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో గ్లాస్‌ నీరుపోసి గ్యాస్ స్టవ్ మీద మరిగించాలి. తర్వాత అందులో అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ పసుపు కలపాలి. వీటిని వడపోసి ఈ నీటితో 5 సార్లు పుక్కిలించాలి. క్రమంగా నొప్పి తగ్గుతుంది.

Tags:    

Similar News