Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కడుపులో ఏదో తేడా కొడుతోందని అర్థం

Signs of Poor Digestion: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకున్న ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-02-22 13:30 GMT

Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కడుపులో ఏదో తేడా కొడుతోందని అర్థం

Signs of Poor Digestion: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకున్న ఆ ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీర్ణాశయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది. అందుకే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని లక్షణాల ఆధారంగా మన జీర్ణ వ్యవస్థ సవ్యంగానే ఉందా.? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.? లాంటి విషయాలను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* జీర్ణ వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వచ్చే ప్రధాన సమస్య గ్యాస్‌. ఈ కారణంగా పొట్ట‌లో అసౌక‌ర్యంగా ఉంటుంది. గ్యాస్ త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌స్తుంటుంది. అలాగే భోజ‌నం చేసే స‌మ‌యంలో, భోజ‌నం చేసిన వెంట‌నే కూడా గ్యాస్ వ‌స్తుంది. పుల్లటి తేన్పులు వస్తుంటాయి. కడుపంతా పట్టేసినట్లు ఉంటుంది. ఆకలి వేయదు, కడుపులో నొప్పిగా ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

* మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే తెలిసే మరో లక్షణం పొట్ట, ఛాతిలో మంట‌గా అనిపించడం. గొంతులోనూ నిత్యం మంటగా ఉంటుంది. ఇది అసిడిటీ లక్షణంగా చెప్పొచ్చు. ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జీర్ణాశ‌యంలో ఆమ్లాలు అధికంగా ఉత్ప‌త్తి అయ్యి గొంతు వ‌ర‌కు యాసిడ్లు వ‌స్తాయి. కాలం మ‌సాలా ఆహారాలు, కారం, టీ, కాఫీ, మ‌ద్యం ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య వస్తుంది.

* తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణకాకపోయినా, విరేచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు కూడా జీర్ణ సంబంధిత సమస్యలుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. త‌ర‌చూ ఇలా జ‌రుగుతుందంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని అర్థం చేసుకోవాలి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించాలి.

Tags:    

Similar News