Feeder Milk: పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా.. చాలా ప్రమాదం..!

Feeder Milk: మీ బిడ్డకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా.. చాలా ప్రమాదం...

Update: 2022-03-11 07:15 GMT

Feeder Milk: పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా.. చాలా ప్రమాదం..!

Feeder Milk: మీ బిడ్డకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా.. చాలా ప్రమాదం. నిజానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విక్రయించే పిల్లల పాల సీసాలు, సిప్పర్లలో ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఈ విషయం ఓ పరిశోధనలో తేలింది. పిల్లల ఆరోగ్యం కోసం ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలామంది ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లల పాల సీసా, సిప్పర్ కప్పులో రసాయనం ఉంటుంది.

ఇది ప్రాణాంతకం అని అనేక పరిశోధనల ద్వారా స్పష్టమైంది. పిల్లల పాల సీసాలో 'బిస్ఫినాల్-ఎ' అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా హానికరం. దీని ప్రభావం వల్ల పిల్లలకు తర్వాత కాలంలో వివిధ రకాల జబ్బులు వస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా ఢిల్లీకి చెందిన టాక్సిక్ లింక్ అనే సంస్థ తన పరిశోధన నివేదికలో ఈ వివరాలని వెల్లడించింది. దేశ మార్కెట్లో విక్రయించే పాల సీసాలు, సిప్పర్లు పిల్లలకు సురక్షితం కాదని పేర్కొంది.

చౌకైన, నాసిరకం కంపెనీల సీసాలు రసాయనాల పూతతో మెత్తగా ఉంటాయి. అలాగే బాటిల్ ఎక్కువ కాలం చెడిపోదు. వేడి పాలు లేదా నీరు సీసాలో పోసి పిల్లలకి తాగిపించినప్పుడు ఈ రసాయనం కరిగి పిల్లల శరీరంలోకి వెళుతుంది. తర్వాత ఈ రసాయనం కడుపు, ప్రేగుల మధ్య మార్గాన్ని మూసివేస్తుంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. అంతే కాదు పాల సాయంతో ఎక్కువ కాలం శరీరంలో రసాయనాలు చేరడం వల్ల గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు సంభవించే అవకాశం ఉంది.

Tags:    

Similar News